సోషల్ మీడియాపై హీరోయిన్ షాకింగ్ డెసిషన్!
రీసెంట్ గా మట్టి కుస్తీ2 ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి, సోషల్ మీడియా గురించి తన పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 21 July 2026 12:48 AM ISTసోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే తన డెసిషన్ పై నటి ఐశ్వర్య లక్ష్మి క్లియర్ గా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు సోషల్ మీడియాను అభిమానులతో అనుసంధానానికి మెయిన్ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ, తాను మాత్రం ఆ మార్గాన్ని పూర్తిగా వదిలేశానని, ఎంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినా తిరిగి ఆ ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చే ఆలోచన లేదని ఆమె వెల్లడించారు.
మెడిసిన్ చదివిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య లక్ష్మి, గ్లామర్ కంటే యాక్టింగ్ ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పొన్నియిన్ సెల్వన్2, కింగ్ ఆఫ్ కోత్తా, థగ్ లైఫ్, మట్టి కుస్తీ, గాడ్సే వంటి సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సరసన తెరకెక్కుతున్న తెలుగు సినిమా సంబరాల ఏటి గట్టులోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
రీసెంట్ గా మట్టి కుస్తీ2 ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య లక్ష్మి, సోషల్ మీడియా గురించి తన పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకున్నారు. తన దృష్టిలో సోషల్ మీడియా అనేది సేఫ్ ప్లాట్‌ఫారమ్ కాదని, అక్కడి నుంచి పూర్తిగా దూరమైన తర్వాత తన లైఫ్ లో ఎంతో ప్రశాంతత వచ్చిందని చెప్పారు. అందుకే తిరిగి ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు.
ఈ డెసిషన్ వెనుక ఉన్న రీజన్‌ను కూడా ఆమె వెల్లడించారు. గతంలో తన ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రచారం చేయడంతో పాటు, పర్సనల్ గా బాధించే కామెంట్స్ చేసిన సంఘటనలు ఎదురయ్యాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తనను ద్వేషిస్తున్నారేమో అన్న భావన కలిగేదని, ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకే సోషల్ మీడియాను పూర్తిగా విడిచిపెట్టినట్లు వివరించారు.
ప్రస్తుతం సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్, ఫేక్ కంటెంట్, వ్యక్తిగత దూషణలపై తరచూ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఐశ్వర్య లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ మరోసారి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల సేఫ్టీ, బాధ్యతాయుత వినియోగంపై డిస్కషన్‌కు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా అవకాశాలున్నప్పటికీ, మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఆమె నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
