ఐశ్వర్యను చూస్తుంటే జయ బాధురి గుర్తొచ్చారు: జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్
యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ రూపొందించిన సీతాపయనం వేలెంటైన్స్ డే కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 16 Feb 2026 12:59 AM ISTయాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ రూపొందించిన సీతాపయనం వేలెంటైన్స్ డే కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య నటనకు మంచి పేరొచ్చింది. తాజాగా థాంక్స్ మీట్ లో సీనియర్ జర్నలిస్ట్, క్రిటిక్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఐశ్వర్య నటనపై ప్రశంసలు కురిపించారు. తనను చూడగానే వెటరన్ నటి జయ బాధురి గుర్తొచ్చారని అన్నారు.
ఫిలిం క్రిటిక్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ- ''ఇలాంటి మంచి సినిమా తీసిన మీకోసం జర్నలిస్టులు అభినందన సభ ఏర్పాటు చేయాలి. ఇది పనిష్ మెంట్ కాదు.. పూర్తి వినోదం అందించారు అని ఆడియెన్ ఫీలైతే అది మంచి ఎఛీవ్ మెంట్. అలాంటి అఛీవ్ మెంట్ ని ఈ చిత్రం సాధించింది. సీతాపయనం అని కాదు `తీపి బాధ` అని టైటిల్ పెట్టినా సరిపోతుందనిపించింది. అంత మంచి కంటెంట్ ని అందించారు. అర్జున్ పెద్ద దర్శకుల వద్ద పని చేసి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఒక ప్రేమకథలా ప్రారంభించి.. కథానాయికకు ఫలానా సమస్య ఉందని కనెక్ట్ చేసి.. ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయిని కనెక్ట్ చేసి.. చివరికి లైఫ్ అనేది ఒక జర్నీ అని చూపించారు. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల అనుబంధంపై ఈ సినిమా తీసారు. అమెరికా అధ్యక్షుడైనా, అంబానీ అయినా కూతురు అనే సెంటిమెంట్ ముందు పిల్లి అయిపోతారు. ఆడపిల్ల పుట్టగానే తండ్రి సున్నితంగా మారిపోతాడు. తన కుమార్తెలోని నటిని ఎలివేట్ చేసేందుకు అర్జున్ తనే స్వయంగా దర్శకత్వం వహించారు. ఆయన ఒక మంచి కుమార్తెను కన్నారు. ఐశ్వర్య అర్జున్‌ను చూడగానే జయ బాధురిని చూసినట్టు అనిపించింది. చాలా మంది దర్శకులు, కథానాయికలు, హీరోలు అందరినీ చూస్తున్నాం. అరుదుగా మీలాంటి నటి వస్తారు'' అని అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం వర్త్ ఫుల్‌గా ఉంది. నేను ఎలాంటి ఇంట్లోకి వెళతానో అనే బెంగ కదా నాన్నా! అనే డైలాగ్ రాసారు సాయిమాధవ్. ఆ డైలాగ్ కి ఏడ్వని తండ్రి ఉంటే అసలు తండ్రే కాదు! సినిమాలో ప్రతి సీన్ ని చెప్పగలను.. అని నాగేంద్ర కుమార్ అన్నారు.
మైక్రో ఫ్యామిలీలో చిక్కుకుపోయిన ఇద్దరి కథ. ఇంట్లో తల్లి కూడా ఉండదు. ఇందులో సైకలాజికల్ సమస్యను తెరపై చూపించారు. నిజానికి మైక్రో కుటుంబాల్లో సైక్రియాట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు సమాజంలో ఉన్న పెద్ద సమస్య. అలాంటి సమస్యలో ఉన్న అమ్మాయి ఒక ఉమ్మడి కుటుంబంలోకి వెళితే ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు. ''ఇది సినిమా కాదు ఒక ప్రిస్క్రిప్షన్.. ఆడపిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలి.. కుటుంబాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి.. ఎలాంటి భర్తను వెతకాలి.. కుటుంబంలో తేడాలు జరుగుతుంటే ఏం చేయాలో ప్రిస్క్రిప్షన్ ఇచ్కచారు. పెళ్లిళ్లు పెటాకులవుతుంటే లాయర్లు ఫ్యామిలీ సమస్యలపైనే కోట్లు సంపాదిస్తున్నారు. ఇది మంచి నేర్పించే సినిమా అవుతుంది'' అని అన్నారు. యాక్షన్ కింగ్ గా అర్జున్ తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నారు. దర్శకుడిగా నిర్మాతగాను కింగ్ అని నిరూపించారని జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ ప్రశంసించారు.
