స్పిరిట్ లో ఐశ్వర్య దేశాయ్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!
అందులో భాగంగానే తాజాగా వివేక్ ఒబెరాయ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆయన పక్కనే కూర్చుని.. బ్లాక్ గాగుల్స్ ధరించి, సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఒక నటి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది .
By: Madhu Reddy | 28 Feb 2026 12:57 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఎప్పటినుంచో నెలకొన్నాయి.దీనికి తోడు న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ త్రిప్తి డిమ్రీతో కలిసి షేర్ చేయడంతో ఆ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా ఒక సంచలనం సృష్టిస్తోంది. అందులో భాగంగానే తాజాగా వివేక్ ఒబెరాయ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆయన పక్కనే కూర్చుని.. బ్లాక్ గాగుల్స్ ధరించి, సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఒక నటి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది .
దీంతో ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? స్పిరిట్ లో ఆమె పాత్ర ఏంటి? అసలు ఆమెను తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి ? ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య దేశాయ్. ఇండో అమెరికన్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. అంతర్జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలలో నటించి, తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటికే గల్లీ బాయ్స్, రాట్ ఇన్ ద కిచెన్ వంటి చిత్రాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ నటన అనుభవమే ఇప్పుడు ఏకంగా సందీప్ రెడ్డి సినిమాలో కీలకమైన పాత్ర దక్కేలా చేసిందని చెప్పవచ్చు
ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్న నెగిటివ్ పాత్రతో ఆమె పాత్రకి ఉన్న అనుబంధం.. కథలో ఒక ఊహించని మలుపుకు కారణం అవుతుందని ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత నెటిజెన్స్ తమ అభిప్రాయాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఐశ్వర్య దేశాయ్ ఇప్పటికే పలు చిత్రాలు చేసినా.. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ తో.. సందీప్ రెడ్డి వంగా వంటి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రాజెక్ట్ లో భాగం కావడం అనేది ఆమె కెరీర్ కు ఒక ఊహించని మలుపు కానుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఐశ్వర్య దేశాయ్ తన ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. గ్లామర్ తో అభిమానులను సొంతం చేసుకుంది. పైగా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈమె.. ఇందులో ఒక పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వడం ఖాయమని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. మొదట దీపికా పదుకొనేను అనుకున్నప్పటికీ పలు కారణాలవల్ల ఆమెను తప్పించి యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించి ఓవర్ నైట్ లోనే ఇమేజ్ సొంతం చేసుకున్న త్రిప్తిని మళ్లీ తన సినిమాలో తీసుకోవడం గమనార్హం.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఎప్పటినుంచో నెలకొన్నాయి.దీనికి తోడు న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ త్రిప్తి డిమ్రీతో కలిసి షేర్ చేయడంతో ఆ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా ఒక సంచలనం సృష్టిస్తోంది. అందులో భాగంగానే తాజాగా వివేక్ ఒబెరాయ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆయన పక్కనే కూర్చుని.. బ్లాక్ గాగుల్స్ ధరించి, సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఒక నటి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది .
దీంతో ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? స్పిరిట్ లో ఆమె పాత్ర ఏంటి? అసలు ఆమెను తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి ? ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య దేశాయ్. ఇండో అమెరికన్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. అంతర్జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలలో నటించి, తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటికే గల్లీ బాయ్స్, రాట్ ఇన్ ద కిచెన్ వంటి చిత్రాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ నటన అనుభవమే ఇప్పుడు ఏకంగా సందీప్ రెడ్డి సినిమాలో కీలకమైన పాత్ర దక్కేలా చేసిందని చెప్పవచ్చు
ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్న నెగిటివ్ పాత్రతో ఆమె పాత్రకి ఉన్న అనుబంధం.. కథలో ఒక ఊహించని మలుపుకు కారణం అవుతుందని ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత నెటిజెన్స్ తమ అభిప్రాయాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఐశ్వర్య దేశాయ్ ఇప్పటికే పలు చిత్రాలు చేసినా.. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ తో.. సందీప్ రెడ్డి వంగా వంటి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రాజెక్ట్ లో భాగం కావడం అనేది ఆమె కెరీర్ కు ఒక ఊహించని మలుపు కానుంది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఐశ్వర్య దేశాయ్ తన ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. గ్లామర్ తో అభిమానులను సొంతం చేసుకుంది. పైగా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈమె.. ఇందులో ఒక పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అయిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వడం ఖాయమని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రి నటిస్తోంది. మొదట దీపికా పదుకొనేను అనుకున్నప్పటికీ పలు కారణాలవల్ల ఆమెను తప్పించి యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించి ఓవర్ నైట్ లోనే ఇమేజ్ సొంతం చేసుకున్న త్రిప్తిని మళ్లీ తన సినిమాలో తీసుకోవడం గమనార్హం.