రూమర్స్ కి గట్టి కౌంటర్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!
ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై మెరిసి.. విడాకుల రూమర్స్ కి ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టిన రూమర్స్ మాత్రం ఆగకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.
By: Madhu Reddy | 24 Dec 2025 2:00 PM ISTసోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత స్టార్ సెలబ్రిటీ జంటలు విడివిడిగా కనిపించిన లేదా అసలు కనిపించకపోయినా వారి మధ్య విడాకుల రూమర్స్ క్రియేట్ చేస్తూ.. ఆ జంటకు విపరీతమైన ఇబ్బందులను కలగజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్లో స్టార్ జంటగా పేరు సొంతం చేసుకున్న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల గత 2 ఏళ్లుగా విడాకుల రూమర్లు ఏ రేంజ్ లో వినిపించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై మెరిసి.. విడాకుల రూమర్స్ కి ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టిన రూమర్స్ మాత్రం ఆగకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.
అటు ఐశ్వర్య రాయ్ ఇటు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కూడా విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. దీనికి తోడు ఇటీవల వీరు..తమ కూతురు ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ లో కూడా కలిసి కనిపించారు. అలాగే ఒక సెలబ్రిటీ వివాహ వేడుకలో కూడా కలిసి కనిపించారు. ఇలా ఎన్నోసార్లు కలిసి కనిపించడమే కాకుండా అప్పుడప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అయినా సరే రూమర్స్ మాత్రం ఆగలేదు.
అయితే అలాంటి ఈ జంట మరొకసారి రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా వీరు ముగ్గురు కలిసి విహారయాత్రకు బయలుదేరినట్లు కనిపించారు. ముగ్గురు కూడా నల్లటి దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు వీరిని ఫోటో తీసే ప్రయత్నం చేయగా.. వారితో ఐశ్వర్య మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకపోతే ఇప్పటికే ఎన్నోసార్లు వీరు జంటగా కనిపించి.. రూమర్స్ కి చెక్ పెట్టినా రూమర్స్ మాత్రం ఆగలేదు ఇప్పుడు మరొకసారి క్రిస్మస్ సందర్భంగా వెకేషన్ కి బయలుదేరుతూ తాము కలిసే ఉన్నామని.. విడిపోలేదని మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు. కనీసం ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.
ఇటు అభిషేక్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన షారుక్ ఖాన్ తో కలిసి కింగ్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా తన నటిస్తోంది. ఇక్కడ తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టబోతోంది. ఇక వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం కానుంది ఈ సినిమా.
ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే.. చివరిగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈమె.. చివరిగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి సరైన కథలు దొరికితే మళ్ళీ ఈ ముద్దుగుమ్మ నటిస్తుందేమో చూడాలి.
