పెళ్లిరోజు స్పెషల్.. విడాకుల రూమర్స్ కి ఐశ్వర్య చెక్!
మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగం ఎప్పటికీ విభిన్నం అనే చెప్పాలి. ఈ రంగంలో జరిగే ఏ చిన్న విషయమైనా సరే క్షణాలలో పాకిపోతుంది
By: Madhu Reddy | 21 April 2026 1:41 PM ISTమిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగం ఎప్పటికీ విభిన్నం అనే చెప్పాలి. ఈ రంగంలో జరిగే ఏ చిన్న విషయమైనా సరే క్షణాలలో పాకిపోతుంది. అందుకే సెలెబ్రిటీలు ఆచితూచి అడుగులు వేయాలి అని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అటు సోషల్ మీడియాలో అయినా ఇటు పబ్లిక్ లో అయినా నడుచుకునే తీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే కామెంట్లు ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అభిషేక బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఏ రోజు కూడా విమర్శలకు చోటు ఇవ్వలేదు. కానీ అనూహ్యంగా వీరిద్దరి మధ్య విడాకులు అంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు.. ఒక్క పోస్టుతో క్లారిటీ..
అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన రూమర్స్ కి ఇద్దరూ చెక్ పెట్టినా ఎక్కడా ఆగలేదు. దీనికి తోడు అంతర్జాతీయ వేదికలపై కూడా ఐశ్వర్యరాయ్ విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది . అయినా సరే ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని చెప్పాలి. దీనికి తోడు పెళ్లిరోజు సందర్భంగా మరొకసారి తాము విడిపోలేదు అని గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ కూడా వైరల్ గా మారింది.
పెళ్లిరోజు స్పెషల్.. రూమర్స్ కి చెక్ పెట్టిన ఐశ్వర్యరాయ్..
ఇకపోతే నేడు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ 19వ వెడ్డింగ్ యానివర్సరీ.. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ తన భర్త, కూతురితో కలిసి దిగిన ఒక క్యూట్ ఫోటోని సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం హార్ట్ సింబల్ ని మాత్రమే ఆమె జోడించింది. ఏది ఏమైనా ఇన్ని రోజులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తలకు కనీసం ఈ ఫోటోతోనైనా పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.
ఇకపోతే సోషల్ మీడియాలో ఈ ఫోటో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంతమంది రూమర్స్ ఎఫెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఎలాంటి కామెంట్లు చేసిన ఐశ్వర్య మాత్రం తన రూమర్స్ కి చెక్ పెట్టింది అని ఫ్యాన్స్ సపోర్ట్ పలుకుతున్నారు.
ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ ప్రేమ, పెళ్లి:
ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. ధూమ్ 2 సినిమా షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడి ఆ తర్వాత తమ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. ఇక 2007 జనవరి 14వ తేదీన నిశ్చితార్థం చేసుకోగా.. ఈ విషయాన్ని బాలీవుడ్ బిగ్ బీ, అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ అధికారికంగా ప్రకటించారు. ఇక 2007 ఏప్రిల్ 20వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట వివాహం అనంతరం నాలుగేళ్లకు అంటే 2011 నవంబర్ 16న పండంటి కూతురికి జన్మనిచ్చింది ఐశ్వర్యారాయ్.
