మోనోకినిలో హీట్ పుట్టించిన శర్మా గాళ్
మరోవైపు సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో లైమ్ లైట్ లో ఉంచేందుకు ఐషా తనంతట తానుగా ప్రయత్నిస్తోంది.
By: Srikanth Kontham | 18 Nov 2025 12:00 AM ISTమ్యూజిక్ వీడియోలతో పాపులరై, సినిమాల్లో నటించి, తిరిగి మ్యూజిక్ వీడియోలతోనే సరిపెడుతోంది ఐషా శర్మ. ఈ బ్యూటీ పెద్ద తెర కలలు ఆశించినంతగా నెరవేరలేదు. వృత్తిపరంగా ఐషా శర్మ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియో `ఇక్ వారి`తో పాపులరైంది. జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పేయిలతో కలిసి యాక్షన్ థ్రిల్లర్ `సత్యమేవ జయతే` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హార్డీ సంధు ఆల్బమ్ `కుడియన్ లాహోర్ దియాన్`, అర్జున్ కనుంగో ఆల్బమ్ `రాంగ్రేజ్`, స్టెబిన్ బెన్ `తేరా హోకే నచ్‌దా ఫిరా` వంటి మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఆ తర్వాత తన సోదరి నేహాశర్మతో కలిసి `షైనింగ్ విత్ ది శర్మాస్` అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.
మరోవైపు సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో లైమ్ లైట్ లో ఉంచేందుకు ఐషా తనంతట తానుగా ప్రయత్నిస్తోంది. ఇటీవల మంచు దుప్పటిలో ప్రకృతి రమణీయతతో ఆహ్లాదంగా ఉండే అందమైన దేశం వియత్నాంలో తన విహారయాత్రను ఆస్వాధించింది. అక్కడ తన వంట తానే చేసుకుని తింటూ ప్రకృతి ధామంలో విరామ సమయాన్ని గడిపింది. అభయారణ్యంలో ఈ అనుభవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అంటోంది.
ఈ ఆనంద సమయాన ఐషా స్పందన ఇలా ఉంది. ``పొగమంచుతో కూడిన ఉదయాలు, చక్కని ఆచారాలు, నెమ్మదిగా అల్పాహారాలు.. పవిత్రంగా అనిపించే ప్రశాంత వాతావరణం.. మరి కొన్ని రోజులు నిశ్శబ్ద విలాసవంతమైన ఒక అభయారణ్యంలో ఉన్నాను..``అని రాసింది. వియత్నాంలోని పాపులర్ రిసార్ట్ బ్రాండ్ ని ఐషా శర్మ ప్రమోట్ చేస్తోంది.
ఐషా షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ని పరిశీలిస్తే ఇది పూర్తిగా ఒక వాణిజ్య ప్రకటన. వియత్నాంలోని పాపులర్ రిసార్ట్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తోంది. అయితే ఈ విహారయాత్రలో అభయారణ్యంలో ధైర్యంగా సంచరించేందుకు తనకు తోడుగా ఒక గైడ్ కూడా ఉన్నట్టు అర్థమవుతోంది. ఏది ఏమైనా ఐషా శర్మ తన సెలబ్రిటీ హోదాను తెలివిగా తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు మోడలింగ్ అసైన్ మెంట్స్ పూర్తి చేసేందుకు, ఆర్జనకు సహకరిస్తోందని చెప్పాలి. ఐషా మోనోకినీ షూట్, ఐషా ఫ్రాక్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
