Begin typing your search above and press return to search.

ఐషా శర్మ.. హీటెక్కించేలా గ్లామర్ సెగలు

లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డీప్ నెక్ ఉన్న స్టైలిష్ బ్లాక్ గౌన్​లో ఎంతో కాన్ఫిడెంట్​గా గ్లామరస్ గా కనిపిస్తోంది.

By:  M Prashanth   |   17 Oct 2025 8:18 PM IST
ఐషా శర్మ.. హీటెక్కించేలా గ్లామర్ సెగలు
X

బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనదైన స్టైల్, గ్లామర్​తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఐషా శర్మ. అక్కకు ఏమాత్రం తీసిపోని అందంతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్​ను క్రియేట్ చేసుకుని, నేటితరం కుర్రాళ్లలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డీప్ నెక్ ఉన్న స్టైలిష్ బ్లాక్ గౌన్​లో ఎంతో కాన్ఫిడెంట్​గా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి, ఫ్యాషన్ సెన్స్​కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోలకు లైకులు, కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

జాన్ అబ్రహం హీరోగా నటించిన 'సత్యమేవ జయతే' సినిమాతో ఐషా శర్మ బాలీవుడ్​కు పరిచయమైంది. తన తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, తన అందంతో యూత్​ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ దూసుకుపోతుందని అందరూ ఊహించారు. అయితే, ఐషా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

దీంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, కొన్ని మ్యూజిక్ వీడియోలు, వెబ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. మంచి కథతో బలమైన పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తోంది. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఐషా శర్మ ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన స్టైలిష్ ఫొటోషూట్లతో అభిమానులకు టచ్​లో ఉంటూ, తన క్రేజ్​ను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటోంది.