శర్మా గాళ్ సెల్ఫీలతోనే సగం జీవితం ఖతమ్
నేహా శర్మ అప్పుడప్పుడూ కొన్ని అవకాశాలు అందుకుంటున్నా, తన సోదరి ఐషా శర్మకు మాత్రం ఆశించిన స్థాయి అవకాశాలు రావడం లేదు
By: Sivaji Kontham | 31 Jan 2026 4:00 AM ISTబాలీవుడ్ లో శర్మా గాళ్స్ నేహాశర్మ- ఐషా శర్మ గురించి పరిచయం అవసరం లేదు. నేహా శర్మ అప్పుడప్పుడూ కొన్ని అవకాశాలు అందుకుంటున్నా, తన సోదరి ఐషా శర్మకు మాత్రం ఆశించిన స్థాయి అవకాశాలు రావడం లేదు. అయినా ఐషా శర్మ సోషల్ మీడియాలలో చురుగ్గా ఉంది. తన సోదరి నేహాతో పోటీపడుతూ వరుస ఫోటోషూట్లను తన సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తోంది.
కెరీర్ నిల్ అయిపోయినా శర్మా గాళ్ ఐషా శర్మ ఇంకా ఫోటోషూట్ల కోసమే పాకులాడుతోంది.. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మారింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటో కూడా ఎవరికీ తెలీదు.. చాలా కాలంగా ఆఫర్లు లేక రేసులో వెనకబడిపోయింది ఈ బ్యూటీ. జాన్ అబ్రహాంతో సత్యమేవ జయతే విడుదలై ఇప్పటికే ఏళ్లు అయినా ఇంకా ఒక్క ఆఫర్ కూడా సరైనది లేదు.
అయినా ఐషాకు అవకాశాల్లేకపోయినా కానీ, తన వ్యక్తిగత జీవితంలో జాలీ లైఫ్ కి మాత్రం కొదవేమీ లేదు. దీనికోసం ఈ బ్యూటీ సోషల్ మీడియాల్లో యాడ్ పోస్టింగులతో బాగానే ఆర్జిస్తోంది. నేహాశర్మ- ఐషా శర్మ సిస్టర్స్ కి సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కొన్ని కార్పొరెట్ కంపెనీలు ఈ భామలకు ప్రకటనల్లో నటించే అవకాశాల్ని కల్పిస్తున్నాయి.
తాజాగా ఐషా శర్మ ఇన్ స్టాలో `జనవరి రీక్యాప్` పేరుతో కొన్ని సెల్ఫీలను పోస్ట్ చేసింది.. ఇందులో ఫోటోలతో పాటు, కొన్ని వీడియోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ``21 రోజుల ప్రయాణం., జీవితంలో గుర్తుండిపోయే పుట్టినరోజు.. అద్భుతంగా అనిపించిన ఆస్ట్రేలియాలో ఒక వారం...కృతజ్ఞతతో... స్థిరంగా. పరిపూర్ణంగా..`` అంటూ మిరుమిట్ల ఈమోజీలను షేర్ చేసింది. అద్భుతమైన సెల్ఫీలతో పాటు ఈ అందమైన క్యాప్షన్ తో ఐషా హృదయాలను దోచుకుంది. అయితే ఈ భామ ఇంకా ఎన్నాళ్లు ఇలా? కేవలం ఫోటోషూట్లు, సెల్ఫీషూట్లతోనే కాలక్షేపం చేసేస్తుందా? నటనలో ఆఫర్లు లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. చిన్నవో పెద్దవో ఏవైనా వెబ్ సిరీస్ లలోను అవకాశాలొస్తే నటించాలని కోరుకుంటున్నారు. 2026లో ఐషా శర్మ కెరీర్ మారాలని కూడా చాలా మంది విష్ చేస్తున్నారు. బీహార్ కాంగ్రెస్ నాయకుడి కుమార్తెగా ఐషా శర్మకు పొలిటికల్ లీడర్లలోను ఫాలోయింగ్ ఉన్నా ఈ భామ భవిష్యత్ లో రాజకీయాల్లోకి వస్తుందా లేదా? అన్నది కూడా వేచి చూడాలి.
