సెల్ఫీతో వెల్‌కం చెప్పిన శర్మా గాళ్
బాలీవుడ్ లో కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్నా, సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న అందగత్తెలుగా పాపులరయ్యారు శర్మా గాళ్స్.
By: Sivaji Kontham | 3 Sept 2025 9:23 AM ISTబాలీవుడ్ లో కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్నా, సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న అందగత్తెలుగా పాపులరయ్యారు శర్మా గాళ్స్. నిరంతరం తమ యాక్టివిటీస్‌ని ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ సిస్టర్స్ యూత్ కి బాగా చేరువయ్యారు. ఇక నేహా శర్మ సోదరి ఐషా శర్మ స్పీడ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
ఐషా నిరంతర ఫోటోషూట్ మాయాజాలం ఇంటర్నెట్‌లో బాగానే వర్కవుటవుతోంది. బికినీలు, స్విమ్ సూట్లు, చిట్టి పొట్టి నిక్కర్లు, ఇన్నర్లలో అందాలను ఆరబోయడంలో ఐషా తర్వాతే. ఈ బ్యూటీ తాజాగా ఓ అందమైన సెల్ఫీని షేర్ చేసి దానికి ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. బ్లాక్ టాప్, బ్లూ డెనిమ్స్‌లో కనిపించిన ఐషా తన రింగుల జుత్తును స్వేచ్ఛగా ఆవిష్కరించింది.
ఒక సెల్ఫీ బాగుంటే, తొమ్మిది సెల్ఫీలు బాగుండాలి.. అంటూ లెక్కలు చెప్పింది ఐషా. హలో సెప్టెంబర్ అంటూ కొత్త మాసానికి ఈ బ్యూటీ వెల్ కం చెప్పింది. సెల్ఫీ బావుంది... డెనిమ్స్ బాగుంది..కర్లింగ్ బావుంది.. కర్వులు బావున్నాయ్! అంటూ అబ్బాయిలు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. ఐషా శర్మ ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఐషా శర్మ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియో `ఇక్ వారీ`తో పాపురైంది. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్ `సత్యమేవ్ జయతే`లో జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హార్డీ సంధు రాసిన `కుడియాన్ లాహోర్ దియాన్`, అర్జున్ కనుంగో రాసిన `రాంగ్రేజ్`, స్టెబిన్ బెన్ రాసిన `తేరా హోకే నాచ్డా ఫిరా` వంటి మ్యూజిక్ వీడియోలతో పాటు `షైనింగ్ విత్ ది శర్మాస్` అనే వెబ్ షోలో కూడా కనిపించింది. ఇటీవల ఐషా శర్మకు పెద్ద తెరపై అంతగా అవకాశాల్లేవ్.
