శర్మా గాళ్ గ్లామర్ ఎలివేషన్ సరే .. కెరీర్ సంగతేంటి?
బాలీవుడ్ బ్యూటీ ఆయేషా శర్మ తాజా ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెంటల్లీ ఎ ఫిలాసఫర్.. ఎమోషనల్లీ ఎ ప్లాట్ ట్విస్ట్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో ఆమె లుక్‌కు అభిమానులు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆయేషా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 28 Nov 2026 9:19 AM ISTగ్లామర్ డోస్ తో హీట్ పెంచడంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆయేషా శర్మ రూటే సపరేటు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. కళ్లు చెదిరే అందాలతో మైమరిపిస్తూనే.. ఆకట్టుకునే క్యాప్షన్ ఇచ్చింది. ``మెంటల్లీ ఎ ఫిలాసఫర్.. ఎమోషనల్లీ ఎ ప్లాట్ ట్విస్ట్`` (మానసికంగా ఒక తత్వవేత్త.. భావోద్వేగపరంగా ఒక ఊహించని ట్విస్ట్) అంటూ పెట్టిన క్రేజీ క్యాప్షన్ కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో బిల్లీ ఎలిష్ సాంగ్‌తో దూసుకొచ్చిన ఈ గ్లామర్ బాంబ్.. నెట్టింట లైకులు, కామెంట్ల తుఫాను సృష్టిస్తోంది.
ఆయేషా ఫిలాసఫికల్ పంచ్‌పై నెటిజన్లు తమదైన స్టైల్లో చిలిపి కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ``ఒక ఫిలాసఫర్ ఇంత హాట్ అండ్ సె*క్సీగా ఉంటే మేము ఫాలో అవ్వకుండా ఎలా ఉంటాం బేబీ?`` అంటూ ఒక అభిమాని కొంటెగా స్పందించగా, ``హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. అందంతో పాటు తెలివితేటలు ఉన్న బ్యూటీ`` అంటూ మరికొందరు కితాబిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా `మిస్ ఫిలాసఫర్`, `మోస్ట్ స్టన్నింగ్ ఫిలాసఫర్ ఎవర్` అంటూ కొత్త బిరుదులు తగిలిస్తూ కామెంట్ బాక్స్‌ను వేడెక్కిస్తున్నారు.
ఇక ఈ పోస్ట్‌లో ఆయేషా హెయిర్ స్టైల్.. స్టన్నింగ్ అవుట్‌ఫిట్ .. ఎలిగెన్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోతుండగా.. ``ఎప్పటికీ నా ఫేవరెట్ శర్మ గర్ల్ నువ్వే`` అంటూ డైహార్డ్ ఫ్యాన్స్ తమ ప్రేమను కురిపిస్తున్నారు. కేవలం మన దేశం నుంచే కాకుండా విదేశీ కుర్రాళ్లు సైతం ఆమె మత్తెక్కించే అందాలకు ఫిదా అవుతూ.. కామెంట్ల రూపంలో తమ మనసులోని మాటను బయటపెడుతున్నారు.
అయితే నెటిజనుల ప్రశంసల నడుమ కొన్ని వెరైటీ మెసేజ్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ నెటిజన్ ఏకంగా అయేషా జాతకం చూసి ప్రస్తుతం శని ప్రభావం తనపై ఏదీ లేదని.. దీనివల్ల అద్భుతమైన సక్సెస్ వస్తుందని జ్యోతిష్యం చెప్పగా.. మరొకరు ఈమోజీలతో తమ లవ్ ప్రపోజల్ పెట్టేశారు. ఇంకో వీరాభిమాని అయితే ఏకంగా ఐదు వరుస కామెంట్లలో కుంభ రాశి లక్షణాలు..నిజాయితీ గురించి పెద్ద క్లాసే తీస్కున్నాడు. ఏదేమైనా ఒకే ఒక్క పోస్ట్‌తో ఆయేషా శర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
కెరీర్ పరంగా చూస్తే జాన్ అబ్రహాం సరసన `సత్యమేవ జయతే` మినహా పెద్ద ఆఫర్లేవీ ఈ భామను వరించలేదు. 2026లో కూడా ఆమె చేతిలో కొత్తగా అధికారికంగా ప్రకటించిన హిందీ సినిమాలు గానీ.. వెబ్ సిరీస్‌లు గానీ లేవు. గతంలో తన సోదరి నేహా శర్మతో కలిసి `షైనింగ్ విత్ ది శర్మాస్` అనే రియాలిటీ వెబ్ షోలో కనిపించింది. ఆయేషా శర్మ పేరు `రావడి` అనే తమిళ సినిమాలో నటిస్తోందని టాక్ వినిపిస్తున్నా.. ఈ చిత్రం ఇంకా విడుదలకు రావాల్సి ఉంది.
