వీడియో : అద్దంలో దాగి ఉన్నది శర్మా భూతం
అద్దంలో దాగిన ఆ భూతాన్ని కనిపెట్టారా? అందంగా ఉంది.. సొగసు ఆరబోస్తోంది. తనను తానే చూసుకుని మురిసిపోతోంది.
By: Sivaji Kontham | 28 Nov 2025 5:00 AM ISTఅద్దంలో దాగిన ఆ భూతాన్ని కనిపెట్టారా? అందంగా ఉంది.. సొగసు ఆరబోస్తోంది. తనను తానే చూసుకుని మురిసిపోతోంది. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ సొగసరి భూతం పేరు -ఐషా శర్మ. చిరుత బ్యూటీ నేహా శర్మ సోదరి. బిహార్ కి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి గారాల పట్టీ.
శర్మగాళ్ మరోసారి అందాల ఆరబోతతో చెలరేగిపోయింది. బ్లాక్ కలర్ శాటిన్ ఫ్రాక్ లో ఐషా తన అందాలను ఎలివేట్ చేస్తూ, అలా అద్దంలో సొగసులను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతోంది. ఐషా ఈ కొత్త లుక్‌లో టూ హా* గా ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఐషా శర్మ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియో `ఇక్ వారీ`తో పాపురైంది. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్ `సత్యమేవ్ జయతే`లో జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హార్డీ సంధు రాసిన `కుడియాన్ లాహోర్ దియాన్`, అర్జున్ కనుంగో రాసిన `రాంగ్రేజ్`, స్టెబిన్ బెన్ రాసిన `తేరా హోకే నాచ్డా ఫిరా` వంటి మ్యూజిక్ వీడియోలతో పాటు `షైనింగ్ విత్ ది శర్మాస్` అనే వెబ్ షోలో కూడా కనిపించింది. `సత్యమేవ జయతే` తర్వాత ఈ భామకు ఎందుకనో సరైన సినిమా ఆఫర్ లేదు. కెరీర్ పరంగా ఇటీవల పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఆర్జనను కొనసాగిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా తన కెరీర్ బండిని నడిపిస్తోంది. ఐషా నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం ఈ భామ నవతరం దర్శకులు వినిపించే కథలు వింటున్నానని తెలిపింది. ఇంకా తదుపరి ప్రాజెక్ట్ కన్ఫామ్ కాలేదు. మునుముందు వెబ్ సిరీస్ లలోను నటించేందుకు ఆసక్తిగా ఉంది ఐషా. త్వరలోనే ఒక కొత్త సిరీస్ ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
