Begin typing your search above and press return to search.

అయిషా శర్మ.. కవితలతో గ్లామర్ డోస్!

అయిషా శర్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేక లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ను మరింత ఎట్రాక్ట్ చేశాయి.

By:  M Prashanth   |   30 Aug 2025 12:00 AM IST
అయిషా శర్మ.. కవితలతో గ్లామర్ డోస్!
X

అయిషా శర్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేక లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ను మరింత ఎట్రాక్ట్ చేశాయి. గ్రీన్ అవుట్‌ఫిట్‌లో తీసుకున్న సెల్ఫీ, జిమ్‌లో రికవరీ మోమెంట్స్, క్యాజువల్ జీన్స్ టాప్ లుక్స్ ఆమె ఫ్యాషన్ సెన్స్‌కి మరోసారి ఉదాహరణ అయ్యాయి. “స్పార్క్ ఆఫ్ జాయ్” అనే థీమ్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సింపుల్‌గా ఉన్నా, సహజత్వంతో ఆకట్టుకుంటున్నాయి.

అయిషా కెరీర్ విషయానికి వస్తే, మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2018లో జాన్ అబ్రహామ్ హీరోగా వచ్చిన సత్యమేవ జయతే సినిమాతో బాలీవుడ్‌లో డెబ్యూ చేసింది. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల్లో కనిపించినా, పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయినా ఆమె వ్యక్తిగత స్టైల్, సోషల్ మీడియా ప్రెజెన్స్ వలన ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుంది.

ఇటీవల అయిషా ఫిట్‌నెస్‌కి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. జిమ్ ఫోటోలు, వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తోంది. తన రైటింగ్స్, కవితల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త కోణాన్ని చూపిస్తోంది. ఈ మల్టీ టాలెంటెడ్ నటి తన అభిరుచుల్ని ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఫాలోవర్స్‌లో పాజిటివ్ కనెక్ట్ ఏర్పడింది.

స్టైల్ విషయంలో అయిషా ప్రత్యేకత ఏమిటంటే, సింప్లిసిటీని మోడర్న్ టచ్‌తో కలిపి చూపించడం. డ్రెస్ అప్, సెల్ఫీలు, కవితలు ఇవన్నీ ఒకే థీమ్ కింద జాయ్ అనే భావనతో లింక్ చేశారు. దీంతో ఆమె పోస్ట్‌లు గ్లామర్ మాత్రమే కాకుండా, పర్సనల్ టచ్‌తో కూడుకున్నట్లు అనిపిస్తున్నాయి. మరి అమ్మడు రాబోయే రోజుల్లో ఏమైనా ఛాన్సులు అందుకుంటుందో లేదో చూడాలి.