సినిమాల్లేకపోయిన శర్మా గాళ్ షోలేంటో!
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన 360 డిగ్రీల ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
By: Sivaji Kontham | 26 Sept 2025 9:00 PM ISTఈరోజుల్లో అన్ని వైపుల నుంచి కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాది రాజకీయ కుటుంబం, సినిమా కుటుంబం లేదా డాక్టర్ల కుటుంబం అని చెప్పుకుంటే సరిపోదు. నటించి చూపించాలి... నటనలో ఇతరుల కంటే విభిన్నంగా ఏం చేయగలరో చేసి చూపించాలి. పాతను వదిలేసి కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. అప్పుడే స్టార్లుగా ఎదగడం సాధ్యం. ఇలాంటి విషయాల్లో కొందరు ఎలాంటి సినీ నేపథ్యాలు లేకుండా వచ్చి కూడా రాణిస్తున్నారు. డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చి బాలీవుడ్ లో బిజీయెస్ట్ నటిగా మారిన సౌందర్య శర్మ దీనికి ఒక ఉదాహరణ.
అయితే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడి కుమార్తె అయినా కానీ, సినీరంగంలో పరిచయాలు ఉన్నా కానీ, సరైన అవకాశాల్లేక సతమతమవుతోంది ఐషా శర్మ. చిరుత ఫేం నేహా శర్మ గారాల చెల్లెలు ఐషా శర్మ ఎంతగా ఇబ్బంది పడుతున్నా దానిని బయటకు కనిపించనివ్వదు.
జాన్ అబ్రహాం సరసన `సత్యమేవ జయతే` తర్వాత శర్మాగాళ్ ఒక్క ఆఫర్ కూడా అందుకోలేదు. కాంపిటీషన్ ని ఎదుర్కోలేక కెరీర్ పరంగా చతికిలబడిన ఈ బ్యూటీ ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సంపాదనపైనే ఆధారపడుతోంది. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్ గా తన కెరీర్ ని సాగిస్తోంది.
ఐషా నిరంతర ఫోటోషూట్లతో అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన 360 డిగ్రీల ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఐషా వైట్ టాప్- డెనిమ్ జీన్స్ ధరించి ఒంపుసొంపుల ప్రదర్శనతో మతులు చెడగొడుతోంది. దీనికి ఆసక్తికర క్యాప్షన్ ని ఐషా జోడించింది. వైట్ అండ్ బ్లాక్ లో ఉంటే.. ఎప్పటికీ సెల్ఫీ ఓవర్ లోడెడ్ అని అంటారేమో! అంటూ క్యాప్షన్ తో కుర్రకారును టీజ్ చేసింది. శర్మా గాళ్ ని టాప్ యాంగిల్ లో ఎలివేట్ చేసిన తీరు ఆకర్షిస్తోంది.
