Begin typing your search above and press return to search.

కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తున్న ఆయేషా శర్మ!

ఆయేషా శర్మ 1992 జనవరి 25న బీహార్ భాగల్పూర్ లో జన్మించింది. ఈమె తండ్రి ప్రముఖ రాజకీయ నేత అజిత్ శర్మ కాగా.. సోదరి ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ.

By:  Madhu Reddy   |   17 Oct 2025 2:00 AM IST
కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తున్న ఆయేషా శర్మ!
X

ప్రస్తుతకాలంలో చాలా మంది సెలబ్రిటీలు తమ అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బికినీ అందాలతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ అందంతో మరొకసారి ప్రేక్షకులను అలరిస్తూ ఆడియన్స్ లో హీట్ పుట్టించడానికి సిద్ధం అయ్యింది ఆయేషా శర్మ. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె అందులో బికినీ అందాలతో అద్దం ముందు నిలబడి సెల్ఫీ ఫోటోలను షేర్ చేసింది.. తాజాగా ఆయేషా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి కుర్రాళ్ళు హీటెక్కిపోతున్నాం అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయేషాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆయేషా శర్మ 1992 జనవరి 25న బీహార్ భాగల్పూర్ లో జన్మించింది. ఈమె తండ్రి ప్రముఖ రాజకీయ నేత అజిత్ శర్మ కాగా.. సోదరి ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ. ఆయేషా శర్మ విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లోని కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె.. చదువుకునే సమయంలోనే మోడల్గా తన కెరీర్ ను ప్రారంభించింది. అదే సమయంలో పలు బ్రాండ్లను ప్రమోట్ చేసి ప్రమోటర్గా మారింది. ముఖ్యంగా లాక్మే, పెప్సీ క్యాంపస్ మాస్ తో పాటు కొన్ని ప్రసిద్ధ బ్రాండ్లకి కూడా పనిచేసింది. అంతేకాదు 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో ఒకరిగా కనిపించి తన ఉనికిని చాటుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆయేషా శర్మ సినిమాల విషయానికి వస్తే.. 2018లో వచ్చిన సత్యమేవ జయతే అనే చిత్రం ద్వారా హిందీ పరిశ్రమకు అరంగేట్రం చేసింది. విజిలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రానికి మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. టి- సిరీస్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రంలో మనోజ్ బాజ్ పాయ్, జాన్ అబ్రహం నటించారు. వీరితోపాటు ఆయేషా శర్మ , అమృత ఖాన్విల్కర్, మనీష్ చౌదరి కూడా నటించారు. 2018 ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది.

ఈ ఒక్క చిత్రంలోనే నటించిన ఈమె 2022లో ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కానీ పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించి సందడి చేసింది. 2016 లో వచ్చిన ఇక్ వారి మ్యూజిక్ వీడియోలో తొలిసారి కనిపించిన ఈమె.. 2023లో తేరా హోకే నచ్డా ఫిరా అనే మ్యూజిక్ వీడియో లో చివరిసారిగా కనిపించింది. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.