రహస్యంగా పెళ్లి పనులు.. ఇంకెప్పుడు ఓపెన్ అవుతారు?
నిన్న రాత్రి రష్మిక, విజయ్ దేవరకొండ వేర్వేరుగా ఎయిర్‌పోర్టులో కనిపించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
By: Madhu Reddy | 16 Feb 2026 12:04 PM ISTటాలీవుడ్‌లో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్త రోజు రోజుకు అభిమానులలో ఆసక్తి పెంచుతోంది..గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారనే వార్తలు షికారు చేస్తుండగా, తాజాగా ఎయిర్‌పోర్టులో విజయ్ ఇచ్చిన రియాక్షన్ ఈ రూమర్లకు మరిన్ని రెక్కలు తొడిగింది. అటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, ఇటు ముఖ్యమంత్రులను కలుస్తూ బిజీగా ఉన్న రౌడీ బాయ్ అసలు విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంచడం గమనార్హం. ఇక అభిమానులందరూ ఇప్పుడు ఫిబ్రవరి 26 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
26th కోసం వెయిటింగ్.. విజయ్ దేవరకొండ క్రేజీ రిప్లై:
నిన్న రాత్రి రష్మిక, విజయ్ దేవరకొండ వేర్వేరుగా ఎయిర్‌పోర్టులో కనిపించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వీరిద్దరూ పెళ్లి పనుల కోసమే జైపూర్ వెళ్లారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఒక కెమెరామెన్ విజయ్‌ను పలకరిస్తూ 'అన్నా.. 26వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నాం' అని అనగా, విజయ్ తనదైన స్టైల్‌లో అదిరిపోయే రిప్లై ఇచ్చారు. 'వెయిటింగ్ ఎందుకు? ఎలాగైనా వస్తుంది కదా 26th' అని చాలా కూల్‌గా సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెళ్లిని అంగీకరించకుండానే, ఆ తేదీ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
షూటింగ్‌లకు బ్రేక్.. సీఎంలకు ఇన్విటేషన్:
విజయ్, రష్మికల పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తమ తమ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ చెప్పి ఫ్యామిలీతో గడుపుతున్నారు. దీనికి తోడు, విజయ్ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇకపోతే జనరల్ గా కలిసినట్టు అనిపించినా.. విజయ్ దేవరకొండ మాత్రం వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడానికే వెళ్లినట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం, ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ తారల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది. పైగా ఈ రిసెప్షన్ కోసమే ఇప్పుడు రాజకీయ ప్రముఖులను సినీ తారలను విజయ్ దేవరకొండ స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యంగా ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ప్రైవేట్‌గా ఈ వివాహ వేడుక జరగనుంది. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినా, విజయ్ - రష్మిక దాన్ని సున్నితంగా తిరస్కరించారట. ఇక తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని కమర్షియల్ చేయకుండా, కేవలం ఆత్మీయుల మధ్య జరుపుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ క్రేజీ జోడీ పెళ్లి ముచ్చట ఇక కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. మొత్తానికి జైపూర్ కోటలో రష్మిక - విజయ్‌ల వెడ్డింగ్ సందడి మొదలైపోయిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే విజయ్ - రష్మిక ఇంత చేస్తున్నా బయటకు మాత్రం ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. రహస్యంగానే అన్ని చేసేసి ఒక్కసారిగా బాంబు పేలుచుతారేమో.. మొత్తానికి లోలోపలే రహస్యంగా అన్నీ కానిచ్చేస్తున్న...గీత గోవిందం జంట ఫిబ్రవరి 26న నిజ జీవితంలోనూ ఒకటి కావడం పక్కా.. ఆ మధుర క్షణాలను కనులారా చూడడానికి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
