తమన్నాకు కూడా తప్పలేదుగా..
నార్త్ టు సౌత్ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీసులు, స్పెషల్ సాంగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు.
By: M Prashanth | 10 Dec 2025 11:00 PM ISTప్రముఖ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమ్మడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నార్త్ టు సౌత్ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీసులు, స్పెషల్ సాంగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు.
అయితే రీసెంట్ గా తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో బికినీ వేసుకుని కనిపించింది అమ్మడు! దీంతో అవి క్షణాల్లో ట్రెండింగ్ లోకి వచ్చాయి. కొందరు నెటిజన్లు సూపర్ పిక్స్ అంటూ కామెంట్లు పెట్టగా.. మరికొందరు మాత్రం ఫోటోలు కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఇంకొందరు అసలు తమన్నావే కాదని అనుమానించారు. ఎందుకంటే అవి అమ్మడి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడా కనిపించలేదు. మూవీలోని స్టిల్స్ కూడా కాదు. తీరా చూస్తే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినవని అర్థమైంది. AI ఇమేజ్జ నరేషన్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించిన క్రియేట్ చేశారని క్లారిటీ వచ్చింది.
దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా చేయడం కరెక్ట్ కాదని అనేక మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు.. ఏఐ టెక్నాలజీకి బలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నాకు కూడా ఆ బాధ తప్పలేదని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక తమన్నా సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రముఖ సినీ దిగ్గజం వి. శాంతారామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో తమన్నా.. అలనాటి నటి జయశ్రీ పాత్రలో నటిస్తున్నారు. దాంతోపాటు హారర్ థ్రిల్లర్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ మూవీలో మిల్కీ బ్యూటీ యాక్ట్ చేస్తున్నారు.
అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి తమన్నా రేంజర్ మూవీలో నటిస్తున్నారు. బోలే చూడియాన్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న డేరింగ్ పార్ట్ నర్స్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. మరి అప్ కమింగ్ ప్రాజెక్టులతో తమన్నా భాటియా ఎలాంటి హిట్స్ అందుకుంటారో.. ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.
