Begin typing your search above and press return to search.

యూజ్ చేయనంత మాత్రాన AI వాడకపోవడాన్ని చెప్పుకోవాలా?

సినిమా ఇండస్ట్రీ.. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీతో ముందుకు సాగే ఫీల్డ్ అనే చెప్పాలి. ఒకప్పుడు గ్రాఫిక్స్ కే ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు, ఇప్పుడు హై టెక్నికల్ విజువల్స్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   16 Feb 2026 4:43 PM IST
యూజ్ చేయనంత మాత్రాన AI వాడకపోవడాన్ని చెప్పుకోవాలా?
X

సినిమా ఇండస్ట్రీ.. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీతో ముందుకు సాగే ఫీల్డ్ అనే చెప్పాలి. ఒకప్పుడు గ్రాఫిక్స్ కే ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు, ఇప్పుడు హై టెక్నికల్ విజువల్స్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగం సినీ పరిశ్రమలో పెరుగుతోందని చెప్పాలి. అయితే రీసెంట్ గా ఒక హీరో చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆ యంగ్ హీరో మాట్లాడుతూ, 'మా మూవీలో ఇతర సినిమాల్లా ఏఐ టెక్నాలజీ ఉపయోగించలేదు. పూర్తిగా ఎప్పటిలానే పాత పద్ధతుల్లోనే విజువల్స్ తీశాం' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు చాలామందిలో ఒక డౌట్ మొదలైంది. ఏఐ వాడితే టాలెంట్ లేనట్టా? లేక అది కూడా ఒక టూల్ మాత్రమేనా? అంటూ మాట్లాడుకుంటున్నారు.

నిజానికి ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనుల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ రిజల్ట్స్ అందించడమే కాకుండా, నిర్మాతలకు ఖర్చు తగ్గిస్తోంది. నెలల తరబడి పట్టే పనులు ఇప్పుడు రోజుల్లో పూర్తవుతున్నాయి. దీంతో ఏఐని వాడకపోవడం గర్వంగా చెప్పుకోవాలా? లేక కాలానికి తగ్గట్టు టెక్నాలజీని చక్కగా వాడుకోవాలా? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి.

కొంతమంది సినీ ప్రముఖుల అభిప్రాయం ప్రకారం, ఏఐ అనేది ఆర్టిస్ట్ ల టాలెంట్ ను తగ్గించేది కాదు. అది కేవలం హెల్ప్ చూసే టూల్ మాత్రమే. దర్శకుడి క్రియేటివిటీ, క్యాస్టింగ్ అండ్ క్రూ టాలెంట్, కథలోని ఎమోషన్.. ఇవే సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయి. ఏఐ కేవలం వాటిని మరింత మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

మరోవైపు కొందరు మాత్రం ఎప్పటి లానే షూట్ చేస్తే విజువల్స్‌ కు స్పెషల్ నేచురాలిటీ ఉంటుందని అంటున్నారు. పాత పద్ధతుల ద్వారా వచ్చే ఫీలింగ్‌ ను ఏఐ అసలు ఇవ్వలేదని వారు చెబుతున్నారు. అందుకే కొన్ని సినిమాల మేకర్స్ ఇంకా పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రేక్షకులకు కావాల్సింది మంచి కథ, ఆకట్టుకునే యాక్టింగ్, క్వాలిటీ విజువల్స్ మాత్రమేనని చెప్పాలి.

అది ఏఐతో చేశారా? లేక పాత పద్ధతుల్లో చేశారా? అన్నది ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మొత్తానికి, ఏఐ వాడటం అంటే టాలెంట్ లేకపోవడమనే అభిప్రాయం సరైంది కాదనే చెప్పాలి. కాలానికి తగ్గట్టు టెక్నాలజీని యూజ్ చేయడం తెలివైన నిర్ణయం. అలా అని ఆర్టిస్టులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఏదేమైనా ఫ్యూచర్ లో ఏఐ సినిమా ఇండస్ట్రీలో మరింత ఇంపార్టెన్స్ పొందడం ఖాయం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది మాత్రం దర్శకుల చేతుల్లోనే ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.