Begin typing your search above and press return to search.

సీక్వెల్స్ అన్నీ ఫ్యాన్సే తీసేస్తారేమో?

ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు సీక్వెల్స్ రూపొంది ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో కొన్ని భారీ విజయాలు సాధించాయి

By:  M Prashanth   |   28 Oct 2025 12:29 PM IST
సీక్వెల్స్ అన్నీ ఫ్యాన్సే తీసేస్తారేమో?
X

సీక్వెల్స్ ట్రెండ్.. కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు సీక్వెల్స్ రూపొంది ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో కొన్ని భారీ విజయాలు సాధించాయి. మరికొన్ని అంచనాల మధ్య విడుదల అయినా ఆకట్టుకోలేకపోయాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి.

అయితే ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనేక సీక్వెల్స్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెట్స్ పై వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయా చిత్రాల మేకర్స్ ఇప్పటికే సినిమా వర్క్స్ ను మొదలుపెట్టారు.. మరికొందరు మరికొద్ది రోజుల్లో స్టార్ట్ చేయనున్నారు. వాటిపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో ఇప్పటికే యమా క్రేజ్ ఉందని చెప్పాలి.

ఆ లిస్ట్ లో పుష్ప-3, కల్కి-2, సలార్-2, దేవర-2 సహా పలు సినిమాలు ఉన్నాయి. చెప్పాలంటే.. ఆ మూవీలన్నీ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయి. ఇప్పటికే ఆయా సినిమాల హీరోలు, డైరెక్టర్ అంతా బిజీగా ఉన్నారు. సమయం చూసుకుని పట్టాలెక్కించనున్నారు. అయితే కొన్నింటి ట్రైలర్స్ ఇప్పటికే వైరల్ గా మారాయి!

అవునా... అదేంటి ఇప్పటి వరకు ఎలాంటి ట్రైలర్స్ ను మేకర్స్ రిలీజ్ చేయలేదు కదా అని అనుకుంటున్నారా?.. మీరు అనుకున్నది నిజమే. అయితే అవి ఫ్యాన్ మేడ్ ట్రైలర్స్. బాహుబలి-3, పుష్ప-3, కల్కి సీక్వెల్ కు సంబంధించి అభిమానులు రూపొందించిన ట్రైలర్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే వాటిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఫ్యాన్స్ తయారు చేశారు. ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఆ సినిమాల ట్రైలర్స్ ను రూపొందించి పోస్ట్ చేశారు. క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా యూట్యూబ్ లో ఏఐ జనరేటెడ్ వీడియోస్ ను పెట్టారు. అవి కాస్త ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుని సందడి చేస్తున్నాయి.

అదంతా ఒకెత్తు అయితే ఇప్పటికే ఏఐతో కొన్ని మూవీల ట్రైలర్స్ ను క్రియేట్ చేసిన ఫ్యాన్స్.. ఫ్యూచర్ లో ఏకంగా సినిమాలను కూడా తీస్తారేమోనని అనేక మంది నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోనే మూవీ స్క్రిప్ట్ రాసుకుని.. పేరడీ సినిమాలు కూడా తీసేలా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. మరి భవిష్యత్తులో ఎవరో ఒకరు ఆ ప్రయత్నం చేయరని చెప్పలేం. చూడాలి ఏం జరుగుతుందో.