భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఏఐ.. మామూల్ది కాదండోయ్!
సరిగ్గా ఇలాగే ఒక జంట విషయంలో ఏఐ రెడ్ హ్యాండెడ్ గా ఆమె భర్తను పట్టించి అందరిని ఆశ్చర్యపరిచింది.
By: Madhu Reddy | 9 Jan 2026 12:00 AM ISTఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.. అయితే ఈ అధునాతన ఏఐ టెక్నాలజీ ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందివ్వడమే కాకుండా అలాంటి వ్యవహారాలలో తలదూరుస్తూ తప్పుచేసిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడంలో కూడా ఉపయోగపడుతోంది. సరిగ్గా ఇలాగే ఒక జంట విషయంలో ఏఐ రెడ్ హ్యాండెడ్ గా ఆమె భర్తను పట్టించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం తెలిసి ఈ ఏఐ మామూల్ది కాదండోయ్ అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఏఐ భర్తను రెడ్ హ్యాండెడ్ గా భార్యకు పట్టించింది.. అసలు ఏంటో ఈ మేటర్ ఇప్పుడు ఒకసారి చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. BYD కార్ లోని సియావో ఫాంగ్ అనే ఏఐ అసిస్టెంట్ కేవలం రూట్ మ్యాప్ గా మాత్రమే పనిచేయకుండా భర్త ప్రవర్తనను ఎలా గమనించాలో కూడా భార్యకు క్లాస్ పీకింది. ముఖ్యంగా భర్త నవ్వుతూ తాను చేస్తున్న తప్పును మేనేజ్ చేస్తున్నా..పక్కనే కూర్చున్న భార్య స్నాక్స్ తింటూ ఏఐ చెప్పే డిటెక్టివ్ పాఠాలను శ్రద్ధగా విని.. తన భర్త వెలగబెడుతున్న కార్యాలను ఇట్టే కనిపెట్టి భర్తకు గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అందరూ ఔరా అంటూ నోరెళ్ళబెడుతున్నారు.
చైనాకు చెందిన ఈ వీడియోలో.. భార్య తన భర్త BYD కారులోని ఏఐ అసిస్టెంట్ ను ప్రశ్నించింది. అయితే ఏఐ అసిస్టెంట్ అవును లేదా కాదు అని చెప్పకుండా.. ఒక డిటెక్టివ్ లా కొన్ని టిప్స్ చెప్పి తన భర్త బండారం ఎలా బయటపెట్టాలో ఆమెనే గ్రహించుకోవాలని.. ఆమెకు కొన్ని సలహాలు కూడా ఇచ్చింది.. అందులో కారు ఎక్కడికి వెళ్ళింది హిస్టరీ చూస్తే అర్థమవుతుందని, తెలియని లొకేషన్లో లేదా షాపింగ్ మాల్స్ కనిపిస్తే అనుమానించవచ్చని, ఇందుకోసం కారు నావిగేషన్ హిస్టరీ చెక్ చేయమని చెప్పింది.
అంతేకాదు ఆ కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసింది అనే విషయాన్ని కూడా గమనించమని ఆమెకు సలహా ఇచ్చింది. సాధారణం కంటే ఎక్కువ దూరం కారు తిరిగినా.. ఆఫీస్ పని కాకుండా అదనంగా డ్రైవింగ్ చేసిన భర్తను వివరణ అడగమని కూడా సూచించింది. పైగా ఎప్పుడూ కారును పట్టించుకోని భర్త సడన్గా కారును క్లీన్ చేయడం, లోపల మంచి సువాసన వచ్చేలా పెర్ఫ్యూమ్స్ ఉంచడం వంటివి చేస్తే సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని కూడా ఆమెకు అర్థమయ్యేలా తెలియజేసింది.
ఇంకేముంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న భార్య తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఈ కారులోని ఏఐ అసిస్టెంట్ భర్తను భలే తెలివిగా అడ్డంగా బుక్ చేసింది అని కామెంట్ చేస్తే.. మరి కొంతమంది భర్త నవ్వుతున్నాడు అంటే అతను సేఫ్ అని అర్థం అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక్కడ ఏఐ మరో షాకింగ్ టిప్ చెప్పి తెలివిగా ప్రవర్తించింది. భర్త పై మళ్లీ అనుమానం క్రియేట్ చేయకుండా ఏదైనా పక్కా ఆధారం దొరికే వరకు భర్తను అనుమానించవద్దు ప్రశాంతంగా మాట్లాడండి అంటూ మరో సలహా ఇచ్చి అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచింది. ఏది ఏమైనా ఈ ఏఐ మామూల్ది కాదు. మహా తెలివైనది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
