Begin typing your search above and press return to search.

యంగ్ హీరో కి అంత పెద్ద డైరెక్టర్ తో

అయితే అహాన్ తొలి ప్ర‌య‌త్న‌మే ఇంత పెద్ద విజ‌యం సాధించాక‌, అత‌డు న‌టించే త‌దుప‌రి చిత్రం ఎలా ఉండ‌బోతోందో చూడాల‌నే ఆస‌క్తి అభిమానుల్లో రెట్టింపైంది.

By:  Sivaji Kontham   |   28 Sept 2025 2:00 PM IST
యంగ్ హీరో కి అంత పెద్ద డైరెక్టర్ తో
X

సైయ్యారా చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు అహాన్ పాండే. సాహో ఫేం చంకీ పాండే కుమారుడిగా అత‌డు సుప‌రిచితుడు. త‌న తండ్రి సైతం సాధించ‌లేని క్రేజ్‌ను అత‌డు త‌న తొలి చిత్రంతోనే సాధించాడు. సైయ్యారాలో అత‌డి న‌ట‌న‌కు ప్ర‌జ‌లు ఫిదా అయిపోయారు. న‌వ‌త‌రం బ్యూటీ అనీత్ ప‌ద్దాతో అహాన్ రొమాన్స్ ఎంతో స‌హ‌జ‌సిద్ధంగా కుద‌ర‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ప్రేమ‌క‌థా చిత్రాల‌లో ఇంత పెద్ద హిట్ సినిమా లేదు. ఆషిఖి ఫేం మోహిత్ సూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సైయ్యారా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టి. ప్రపంచవ్యాప్తంగా రూ.579 కోట్లు మించిన వసూళ్లతో 2025లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ హిందీ చిత్రంగా నిలిచింది. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ ప్రేమకథ చిత్రంగా రికార్డును నెలకొల్పింది.

అయితే అహాన్ తొలి ప్ర‌య‌త్న‌మే ఇంత పెద్ద విజ‌యం సాధించాక‌, అత‌డు న‌టించే త‌దుప‌రి చిత్రం ఎలా ఉండ‌బోతోందో చూడాల‌నే ఆస‌క్తి అభిమానుల్లో రెట్టింపైంది. ఇప్ప‌టివ‌ర‌కూ సైయ్యారా విజ‌యాన్ని ఆస్వాధించిన అహాన్ త‌న త‌దుప‌రి పెద్ద ప్ర‌య‌త్నం గురించి అధికారికంగా రివీల్ చేయ‌లేదు. కానీ ఇంత‌లోనే అహాన్ పాండే నేరుగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఆఫీస్ ప‌రిస‌రాల్లో క‌నిపించ‌డం ఊహించ‌ని ప‌రిణామం. క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ యువ ప్ర‌తిభావంతుడి కోసం ఒక అద్భుత‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని రూపొందించ‌బోతున్నారా? అనే సందేహం అంద‌రికీ క‌లిగింది. అహాన్ లాంటి యువ‌న‌టుడికి కెరీర్ ఆరంభ‌మే భ‌న్సాలీ నుంచి ఆఫ‌ర్ ద‌క్క‌డం నిజంగా అదృష్టం. అత‌డు దీనికి అర్హుడు అని కూడా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతానికి అహాన్ పాండే తో భన్సాలీ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అభిమానులు ఎవ‌రికి వారు ఊహాగానాలు సాగిస్తున్నారు. ఎక్స్ లో ఒక అభిమాని ఇలా రాసారు. OMGGG అహాన్ SLB ఆఫీసులో కనిపించాడు.. ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేసాడు. మరో అభిమాని.. అహాన్ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటో తెలియ‌ని వారికి.. ఇది షాకింగ్ వార్త‌.. దయచేసి ఇది నిజం కావాలి!అని కోరాడు. భన్సాలీ ప్రాజెక్ట్‌లో అహాన్ ఎలాంటి పాత్ర పోషించవచ్చో చాలా మంది ఊహాగానాలు సాగించారు. భ‌న్సాలీ సినిమాలో ఆహాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు! అని ఒక‌రు ఊహించ‌గా, ద‌య‌చేసి ఈ ప్రాజెక్ట్ ను జ‌ర‌గ‌నివ్వండి! అని మ‌రొక‌రు అభిమానం చూపించారు.