Begin typing your search above and press return to search.

మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే...!

హీరో హీరోయిన్‌గా అహన్‌ పాండే, అనీత్‌ పడ్డాలు ఒక్కసారిగా దక్కించుకున్న క్రేజ్‌ తో వరుస ఆఫర్లు దక్కుతున్నాయి.

By:  Ramesh Palla   |   29 Nov 2025 11:38 AM IST
మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే...!
X

2025లో బాలీవుడ్‌ నుంచి వచ్చిన సూపర్‌ హిట్ చిత్రాలు చాలా తక్కువ. ఇండస్ట్రీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన సినిమా సయ్యారు. కొత్త నటీనటులతో రూపొందిన సయ్యార సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కి ఊపిరి పోసినట్లుగా హిట్ మూవీగా నిలిచింది. సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసిన విషయం తెల్సిందే. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన భారీ చిత్రాలు వందల కోట్ల నష్టాలను మిగిల్చిన సమయంలో వచ్చిన సయ్యార సినిమా ఆ సంస్థకు పూర్వపు ఉత్తేజంను తెచ్చి పెట్టింది. మొత్తంగా బాలీవుడ్‌కి సయ్యార సినిమా మంచి జోష్‌ను తెచ్చి పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సయ్యార సినిమాలో నటించిన అహన్‌ పాండే, అనీత్‌ పడ్డాలు ఓవర్‌ నైట్‌ స్టార్స్‌గా మారి పోయిన విషయం తెల్సిందే.

అహన్‌ పాండే, అనీత్‌ పడ్డాల ప్రేమ కథ...

హీరో హీరోయిన్‌గా అహన్‌ పాండే, అనీత్‌ పడ్డాలు ఒక్కసారిగా దక్కించుకున్న క్రేజ్‌ తో వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన సక్సెస్ వేడుకల్లో, అవార్డ్‌ ఫంక్షన్స్‌లోనూ వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. అంతే కాకుండా వీరి కాంబోలో మరో రెండు మూడు సినిమాలు వస్తాయనే వార్తలు బాలీవుడ్‌ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అహన్‌ పాండే, అనిత్‌ పడ్డాలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ నడుస్తున్నాయని ఏకంగా బాలీవుడ్‌ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రేమగా మారి ఉంటుందని, ఇద్దరిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అంటూ నెటిజన్స్‌, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ విషయమై అహన్‌ పాండే క్లారిటీ ఇచ్చాడు.

సయ్యార సినిమా హిట్‌...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సయ్యార సినిమా కోసం మేము ఇద్దరం కలిసి వర్క్ చేశాం, ఆ సమయంలోనే స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. అంతే కాని ఇద్దరి మద్య రొమాంటిక్‌ సంబంధం ఉందని వస్తున్న పుకార్లు మాత్రం నిజం కాదు. కెమిస్ట్రీ పండితే లవ్ ఉన్నట్లుగా ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించాడు. మరోసారి బల్లగుద్ది మరీ చెబుతున్నాను అంటూ తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ప్రస్తుతం తాను సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టాను అని, ఇతర ఏ విషయాల గురించిన ఆలోచన లేదు అని చెప్పుకొచ్చాడు. మీడియాలో వస్తున్న పుకార్లు ఇకపై అయినా ఆగాలి అని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే మీడియాలో పుకార్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

బాలీవుడ్‌ నుంచి మరో హిట్‌ మూవీ

జులై 18, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సయ్యార సినిమా యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంది. దాంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ సైతం థియేటర్లకు వచ్చే విధంగా నిలిచింది. అందుకే ఈ ఏడాది మేటి చిత్రాల జాబితాలో సయ్యార సినిమా నిలిచింది. 2004లో వచ్చిన ఒక కొరియన్‌ మూవీ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. ఈ సినిమాలో అహన్‌ పాండే, అనీత్‌ పడ్డాల పాత్రలు మన పక్కన ఉన్నట్లుగా అనిపిస్తాయి. దర్శకుడు మోహిత్‌ సూరి విభిన్నమైన సింపుల్‌ స్క్రీన్‌ ప్లేతో సినిమాను నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకు అంతటి పేరు, హిట్‌ దక్కింది అనేది విశ్లేషకుల అభిప్రాయం. విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సయ్యార సినిమాకు సంబంధించిన వార్తలు, సీన్స్ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. అందుకే అహన్‌, అనిత్‌ లు ప్రేమలో ఉన్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.