Begin typing your search above and press return to search.

బాలీవుడ్ జోడీకి హాలీవుడ్ జోడీతో పోలిక‌!

బాలీవుడ్‌ యువ తారలు ఆహాన్ పాండే- అనీత్ పడ్డా గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. తొలి సినిమా `స‌య్యారా`తో సంచ‌ల‌న విజ‌యం అందుకుని ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయ్యారు

By:  Srikanth Kontham   |   26 Aug 2026 5:00 AM IST
బాలీవుడ్ జోడీకి హాలీవుడ్ జోడీతో పోలిక‌!
X

బాలీవుడ్‌ యువ తారలు ఆహాన్ పాండే- అనీత్ పడ్డా గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. తొలి సినిమా `స‌య్యారా`తో సంచ‌ల‌న విజ‌యం అందుకుని ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయ్యారు. ఇద్ద‌రి మ‌ధ్య‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదే సినిమా ఇద్ద‌ర్నీ ప్రేమ‌లోకి దించింద‌ని అంతే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నార‌ని కొంత కాలంగా ప్ర‌చారం పీక్స్ లోనే జ‌రుగుతోంది. అయితే వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్ర‌మేనేని ఎలాంటి రిలేష‌న్ షిప్ లో లేమ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌ర‌ణ ఇస్తున్నా? రూమ‌ర్లు మాత్రం ఆగ‌డం లేదు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలు రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అనీత్ పడ్డా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెకేషన్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలలో అందమైన ప్రకృతి నడుమ చేతిలో పూల గుచ్ఛం పట్టుకుని వెనుక వైపు పచ్చటి వాతావరణం ..ఆవులతో కనిపించారు. అయితే అనీత్ షేర్ చేసిన ఈ ఫొటోల లొకేషన్‌కు, కొద్ది రోజుల క్రితం అహాన్ పాండే తల్లి డియాన్ పాండే పెట్టిన వెకేషన్ ఫొటోలకు ఎంతో పోలిక ఉండటాన్ని నెటిజన్లు ఇట్టే పసిగట్టారు.

బ్రిటన్‌లోని పెన్రిత్, కంబ్రియా ప్రాంతంలో దిగిన ఫొటోల నేపథ్యం వెనుక ఉన్న పచ్చదనం, ఆవుల సెట్టింగ్ అచ్చం ఒకేలా ఉండటంతో అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతేకాదు అనీత్ పట్టుకున్న పూల గుచ్ఛం కూడా డియాన్ పాండే పోస్ట్ చేసిన ఫొటోలలో ఉన్నట్లే ఉండటంతో ముగ్గురూ కలిసి ఒకే ట్రిప్‌కు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ ఫొటోల వెనుక కెమెరామెన్‌గా అహాన్ పాండేనే ఉన్నాడని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అభిమానులు ఇద్ద‌రినీ హాలీవుడ్ జంట టామ్ హోలాండ్ - జెండాయాలతో పోల్చు తున్నారు.

టామ్, జెండాయాల మాదిరిగానే వీరు కూడా తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత ప్రైవేట్‌గా ఉంచుతున్నారు. ఎక్క‌డా యట పడకుండా జాగ్రత్త పడుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు ఎంతగా గోప్యంగా ఉండాలని ప్రయత్నించినా? సోషల్ మీడియా వేదికగా అభిమానుల కంటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అహాన్ - అనీత్‌ల విషయంలోనూ అదే జరుగుతోంది. ఏ చిన్న లొకేషన్ క్లూ దొరికినా దానిని ఇట్టే పసిగట్టేసే నెటిజన్ల పరిశీలనా శక్తి యువ జోడీపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేస్తోంది. ఇండస్ట్రీలో తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఎంత చెబుతున్నా? ఇలాంటి సోషల్ మీడియా డిటెక్టివ్ వర్క్స్ మాత్రం ఇద్ద‌రి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.