సంచలన ప్రాంచైజీలో పండగ చేస్కో బ్యూటీ!
ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్ కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ ఒకేలా సాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 28 Oct 2025 12:00 PM ISTఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్ కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ ఒకేలా సాగుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్ అంటూ నాలుగు భాషల్లోనూ నటించింది. కానీ ఏ భాషలోనూ నిలదొక్కుకోలేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడకు వెళ్లి పని చేయడం తప్ప! తనకంటూ ఓ భాష ఉందని నిరూపించుకోలేకపోయింది. అవకాశాలు వస్తున్నా? వాటితో పాటు చిన్నా చితకా విజయాలు అందుకుంటున్నా? స్థిరంగా మాత్రం పని చేయలేకపోతుంది. అయితే ఏడాది కాలంగా ఆ చిన్న పాటి అవకాశాలు కూడా లేవు.
చివరిగా గత ఏడాది రిలీజ్ అయిన 'డార్డ్' లో నటించింది. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో అమ్మడు ఏకంగా బంపర్ ఆఫర్ అందుకుంది. సంచలన 'మీర్జాపూర్' ప్రాంజెజీలో భాగమవుతుంది. 'మీర్జాపూర్ : దిఫిల్మ్' చిత్రంలో భాగమైనట్లు వెల్లడించింది. అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం సంతోషంగా ఉందంది. ఈ సినిమాలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
'మీర్జాపూర్' కు ప్రత్యేకమైన అభిమానులున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న సిరీస్ ఇది. పంకజ్ త్రిపాఠీ, అలీ జాపర్, దివ్వేందు, శ్వేతా త్రిపాఠీ నటించిన 'మీర్జాపూర్' ప్రాంచైజీ మూడు సీజన్లు పెద్ద విజయం సాధించాయి. ఇప్పుడిదే సిరీస్ ను గుర్మీత్ సింగ్ సినిమా గా తెరపైకి తేవడం విశేషం. మరి ఈ కథను ఒకే సినిమా గా రిలీజ్ చేస్తాడా? రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. సినిమాలో వెబ్ సిరీస్ పాత తారగణంతో పాటు, కొత్త నటీనటులు నటిస్తున్నారు. దీనిలో భాగంగా వెబ్ సిరీస్ లో సోనాల్ చౌహాన్ లేకపోయినా? సినిమా లో అవకాశం అందుకో గలిగింది.
మీర్జాపూర్ ప్రాంతంలో అధికార పోరాటాలు, నేరస్థుల అండర్ వరల్డ్ కథకు కొనసాగింపుగా ఈ కథ ఉంటుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అవి పూర్త యిన వెంటనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశలున్నాయి.
