బాక్సాఫీస్ వద్ద స్టార్ కిడ్స్ క్లాష్
నవంబర్ లో అయితే సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని భావించి నిర్మాత దినేష్ విజన్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Aug 2025 3:00 AM ISTబాక్సాఫీస్ వద్ద స్టార్ల సినిమాలు పోటీ పడటం చాలా కామన్. కానీ ఈసారి స్టార్ పిల్లలు ఒకే రోజు తమ సినిమాలతో పోటీ పడటానికి రెడీ అవుతున్నారు. దీంతో ఇది చాలా పెద్ద విషయంగా మారింది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాలతో రానుండటంతో పాటూ అందులో వారి పెర్ఫార్మెన్సులు ఎలా ఉంటాయా ఎవరు ఆడియన్స్ ను ఎక్కువ మెప్పిస్తారా అని తెలుసుకోవడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఇక్కీస్ పోస్ట్‌పోన్
అయితే ఆ స్టార్ పిల్లలు మరెవరో కాదు, అగస్త్య నంద, జునైద్ ఖాన్. వీరిద్దరి సినిమాలూ నవంబర్ 7న పోటీ పడనున్నాయి. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్య నంద నటించిన ఇక్కీస్ సినిమా, సునీల్ పాండే దర్శకత్వంలో జునైద్ ఖాన్ నటించిన ఏక్ దిన్ సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాస్తవానికి ఇక్కీస్ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కావాల్సింది కానీ అది ఇప్పుడు నవంబర్ 7కు వాయిదా పడింది.
భారీ సినిమాలుండటంతోనే వాయిదా
నవంబర్ లో అయితే సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని భావించి నిర్మాత దినేష్ విజన్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ అక్టోబర్ 2న కాంతార ఛాప్టర్1 మరియు సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఈ రెండు సినిమాలకీ భారీ క్రేజ్ ఉంది. ఇంత పోటీ మధ్యలో ఇక్కీస్ సినిమాను రిలీజ్ చేయడమెందుకుని నిర్మాత దినేష్ విజన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి జునైద్ ఖాన్, అగస్త్య నంద మధ్య జరగనున్న క్లాష్ పై పడింది. అయితే ఎంత క్లాష్ ఉన్నా, సినిమా రిజల్ట్ అనేది అందులోని కంటెంట్ పైనే డిపెండ్ అయి ఉంటుందనేది వాస్తవం. శ్రీరామ్ రాఘవన్ తనదైన స్టైల్ ఫిల్మ్ మేకింగ్ కు ఫేమస్. మరి అతని మ్యాజిక్ మళ్లీ ఇక్కీస్ విషయంలో వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి. మరోవైపు జునైద్ ఖాన్ లవ్ యాపా, జునైద్ ఖాన్ ది ఆర్చీస్ కూడా మంచి రిజల్ట్స్ ను ఇచ్చింది లేకపోవడంతో వీరిద్దరి మధ్య పోటీ ఇద్దరి కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా మారుతుందేమోనని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండి, ఆడియన్స్ కు కనెక్ట్ అయితే అది నెమ్మదిగా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలదు. ఇంకా ఈ క్లాష్ కు రెండు నెలల టైముంది కాబట్టి ఈ లోపు ఏం జరుగుతుందో చూడాలి.
