ఇన్నాళ్టికి బచ్చన్ లెగసీని నడిపించే ఒక్కడొచ్చాడు!
నేను నా తండ్రి (నిఖిల్ నందా) కొడుకును కాబట్టి నా ఇంటిపేరు `నందా`. ఆయనను గర్వపడేలా చేయడమే నా మొదటి ప్రాధాన్యత .. అని అగస్త్య నందా అన్నాడు.
By: Sivaji Kontham | 7 Jan 2026 4:00 AM IST``నువ్వు నందా అయితే ఏంటి.. నేను బద్రి.. బద్రీనాథ్!``.. ఈ డైలాగ్ వింటేనే పవన్ కళ్యాణ్ పవర్.. పూరీ జగన్నాథ్ మార్క్ మేనరిజం గుర్తుకు వస్తాయి! బద్రి (2000) సినిమాలో ప్రకాష్ రాజ్ (నంద) కు పవన్ కళ్యాణ్ ఇచ్చే ఈ హార్ష్ వార్నింగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెస్తుంది.
ఇప్పుడే ఈ డైలాగ్ ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? అంటే.. బిగ్ బి అమితాబ్ మనవడు అగస్త్య నందా అలాంటి ఒక సవాల్ విసిరాడు. నా పేరు నందా! తాత లెగసీని నడిపించడం ఏంటి? లెగసీలతో నాకు పనేంటి? అని ఛాలెంజ్ చేసాడు. అతడి ఉద్ధేశం.. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు నేను అని!
అమితాబ్ నటవారసుడు అభిషేక్ సాధించలేనిది ఇప్పుడు మనవడు అగస్త్య నందా సాధిస్తున్నాడు. ఈ యువకుడు అమితాబ్ కుమార్తె శ్వేతానందా వారసుడు. నందా ఆరంభమే దూకుడుగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు బిగ్ బి కుటుంబం స్థబ్ధుగా ఉండిపోయింది. కానీ ఇప్పుడిప్పుడే సౌండ్ చేయడం ప్రారంభించింది. కపూర్ వంశం నుంచి రణబీర్ కపూర్ పెద్ద సౌండ్ చేస్తున్నాడు. రోషన్ ల కుటుంబం నుంచి హృతిక్ ఎలానూ ఉన్నాడు. డియోల్ వారసులు రైజ్ అయ్యారు. కానీ బచ్చన్ ల వారసత్వం నీరసించిపోయింది. అభిషేక్ బచ్చన్ ఇటీవల పేరు తెస్తున్నాడు కానీ, సరైన డబ్బు తేలేని పరిస్థితి. కమర్షియల్ సినిమాలలో అతడు తేలిపోతున్నాడు. కేవలం మల్టీస్టారర్లతోనే అతడు పెద్ద హిట్లు కొట్టాడు.
కానీ ఇప్పుడు బచ్చన్‌ల లెగసీని ముందుకు నడిపించడానికి ఒకడొచ్చాడు! అనుకుంటుండగానే, అగస్త్య నందా ఇచ్చిన రివర్స్ కోటింగ్ మామూలుగా లేదు. అమితాబ్ లెగసీని నడిపించడాన్ని భారంగా భావిస్తున్నారా? అంటూ మీడియా ఒక డిప్లమాటిక్ క్వశ్చన్ ని యథావిథిగా రైజ్ చేయగా, అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.
నేను నా తండ్రి (నిఖిల్ నందా) కొడుకును కాబట్టి నా ఇంటిపేరు `నందా`. ఆయనను గర్వపడేలా చేయడమే నా మొదటి ప్రాధాన్యత .. అని అగస్త్య నందా అన్నాడు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి పెద్ద నటులతో పోల్చుకోవడం వల్ల వచ్చే ఒత్తిడిని తాను తీసుకోవడం లేదని, ఎందుకంటే తాను ఎప్పటికీ వారిలా కాలేనని వ్యాఖ్యానించాడు.
నిజానికి అగస్త్య నందా తాత అమితాబ్ ని లెజెండ్ అని పొగిడేస్తూనే, లెగసీతో పని లేదు.. అంటూ ధైర్యంగా మాట్లాడాడు. మామ అభిషేక్ ని అతడు ఎక్కడా తగ్గించలేదు. నా ఇంటి పేరు నందా..! అంటూ తన పరపతిని గుర్తు చేసాడు.. డ్యాషింగ్ గా కనిపించాడు. ఒక రకంగా బద్రి రేంజులో సవాల్ విసిరిన అమితాబ్ మనవడు అగస్త్య నందాను చూస్తుంటే కచ్ఛితంగా ఇతడు తాత పరువు మర్యాదలు నిలబెడుతూ గౌరవాన్ని పెంచుతాడనే నమ్మకం పెరిగింది. తాత అమితాబ్ పేరును ఉపయోగించకుండా ఇండస్ట్రీలో ఎదుగుతానని సూటిగా సవాల్ విసిరిన తీరుకు అందరూ స్టన్నయిపోయారు.
శభాష్ అగస్త్య.. అంటూ పొగిడేస్తున్నారు. `ఇక్కీస్`లో అతడి నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమా 5 రోజుల్లో 20 కోట్ల నెట్ వసూలు చేయడం ఒక కొత్త నటుడికి రియల్లీ ఇంపాజిబుల్. కానీ అగస్త్య నందా సినిమా క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడమే గాక బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రంలో ధర్మేంద్ర నటనకు కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. బయోపిక్ కేటగిరీలో వచ్చిన ఈ వార్ మూవీలో అగస్త్య నటనకు ప్రశంసలు కురిసాయి.
నిజానికి మొదటి సినిమాతో అభిషేక్ బచ్చన్ కి ఇలాంటి గుర్తింపు పేరు రాలేదు.. అమితాబ్ నటవారసుడు తీవ్రంగా నిరాశపరిచాడని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ ది ఆర్చీస్ తర్వాత మొదటి సినిమాతోనే షైన్ అయిన అగస్త్య నందా అందరి దృష్టిలో పడ్డాడు. అతడికి సరైన స్క్రిప్టులు, సరైన దర్శకులు తగిలితే చాలు.. పెద్ద స్టార్ల జాబితాలో చేరిపోతాడు. యువహీరో అందగాడు.. ప్రతిభావంతుడు.. చురుకైన వాడు.. అందువల్ల దూసుకెళ్లిపోయేందుకు ఆస్కారం ఉంది.
ఇండో పాక్ యుద్ధ వీరుడి కథ
1971 ఇండో-పాక్ యుద్ధ వీరుడు, పరమ్ వీర్ చక్ర గ్రహీత సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ బయోపిక్‌లో అగస్త్య నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. మొదటి ఐదు రోజుల్లోనే భారతదేశంలో సుమారు రూ.20.72 కోట్లు వసూలు చేసి అగస్త్యకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. అంధాధున్ ఫేం శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 1న ఈ చిత్రం విడుదలైంది.
