Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి నెక్స్ట్ జాన‌ర్ పై అప్పుడే చ‌ర్చ‌?

దీంతో అందరి దృష్టి జ‌క్క‌న్న‌ తదుపరి చిత్రం ఏ జానర్‌లో ఉండబోతోందనే? అంశంపైకి మళ్లింది. రాజమౌళి ప్రతి సినిమాకు జానర్‌ను మారుస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఆయన శైలి.

By:  Srikanth Kontham   |   18 July 2026 7:00 AM IST
రాజ‌మౌళి నెక్స్ట్ జాన‌ర్ పై అప్పుడే చ‌ర్చ‌?
X

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాతో రికార్డులను తిరగరాయడం వెన్నతో పెట్టిన విద్య. `బాహుబలి` చిత్రంతో పీరియాడిక్ వార్ డ్రామాను, `ఆర్ఆర్ఆర్` కమర్షియల్ హంగులతో కూడిన దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రస్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో చేస్తోన్న `వారణాసి` ఓ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. దీంతో అందరి దృష్టి జ‌క్క‌న్న‌ తదుపరి చిత్రం ఏ జానర్‌లో ఉండబోతోందనే? అంశంపైకి మళ్లింది. రాజమౌళి ప్రతి సినిమాకు జానర్‌ను మారుస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఆయన శైలి.

రాజమౌళి సినిమాలకు కథను అందించేది ఆయన తండ్రి, స్టార్ రైటర్ కె.వి. విజయేంద్ర ప్రసాద్. ఆయన రాసే ప్రతి కథలోనూ ఎమోషనల్ కోర్ .. అద్భుతమైన ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈసారి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కోసం ఎలాంటి ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నారనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్. గత చిత్రాల కంటే భిన్నంగా ఇప్పటి వరకు భారతీయ వెండితెరపై చూడని ఓ కొత్త జానర్‌ను ఆయన ఎంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి దృష్టి గ్లోబల్ మార్కెట్‌పై ఉంది. కాబట్టి విజ‌యేంద్రుడి తదుపరి జానర్ కేవలం భారతీయతకే పరిమితం కాకుండా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా సైన్స్ ఫిక్షన్ లేదా అతీంద్రియ శక్తుల కలబోతగా ఉండే అవకాశం లేకపోలేదు. `వారణాసి` చిత్రాన్ని అడ్వెంచర్ జానర్‌లో ఎలాగైతే ఒక స్థాయికి తీసుకెళ్తున్నారో? త‌దురి ప్రాజెక్టును అంతకు మించి భారీ కాన్వాస్‌తో ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కథాంశం ఏదైనా? అందులో రాజమౌళి మార్కు ఎలివేషన్లు మాత్రం తగ్గవని అభిమానుల నమ్మకం.

ఇండస్ట్రీలోని కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రాజమౌళి రియలిస్టిక్ డ్రామా లేదా ఒక మ్యాజికల్ రియలిజం నేపథ్యం ఉన్న సినిమా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పెద్ద బడ్జెట్ సినిమాలతో అలిసిపోయిన ఆయన బడ్జెట్‌తో సంబంధం లేకుండా బలమైన కథతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేయోచ్చ‌ని గెస్ చేస్తున్నారు. రాజమౌళి నుండి వస్తున్న ప్రతి చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్ కాబట్టి కథతో పాటు సాంకేతికతకు కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తారు.

విజయేంద్ర ప్రసాద్ కలం నుండి జాలువారే కధ ఎప్పుడూ పజిల్ లా ఉంటుంది. ఆయన రాసే కథలో ట్విస్టులు, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం రాజమౌళికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తదుపరి జానర్ గురించి బయటకు వస్తున్న వార్తలు ఊహాగానాలే అయినా? రాజమౌళి ఆశీస్సులతో రూపొందే ఆ తదుపరి ప్రాజెక్ట్ కచ్చితంగా కొత్త ఒరవడిని సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. కథకు ఏ జానర్ ముసుగు వేసినా? దాని వెనుక ఉన్న ఆత్మ మాత్రం అద్భుతమైన ఎమోషన్ అని చెప్పొచ్చు.

చివరగా రాజమౌళి తదుపరి చిత్రం ఏ జానర్ అయినా? అది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకె ళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `వారణాసి` తర్వాత ఆయన ఎంచుకునే? మార్గం సినీ చరిత్రలో మరొక మైలురాయిగా నిలవాలని ప్రేక్షకాభిమానుల‌ను కోరుకుంటున్నారు. ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో? కథ ఎలా ఉండబోతుందో? తెలియాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టివ‌ర‌కూ ఎదురు చూడ‌క త‌ప్ప‌దు.