అమ్మడికి టాలీవుడ్ నచ్చేసిందా..?
ఇట్లు అర్జున అంటూ ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతుంది అనస్వర. మలయాళంలో ఎనిమిదేళ్లుగా పాతిక సినిమాలకు పైగా అమ్మడు కెరీర్ కొనసాగిస్తుంది.
By: Ramesh Boddu | 29 Dec 2025 6:00 PM ISTమొన్నటిదాకా ప్రేమలు హీరోయిన్ మమితా బైజు మీద తెలుగు యూత్ ఆడియన్స్ ప్రేమను కురిపించగా లేటెస్ట్ గా ఛాంపియన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మీద తెలుగు ఆడియన్స్ తన అభిమానాన్ని చూపిస్తున్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కిన ఛాంపియన్ సినిమాలో రోషన్ కి జతగా నటించింది అనస్వర రాజన్. క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ సినిమాలో అనస్వర ఆకట్టుకుంది. ఐతే ఈ సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో మరో తెలుగు ఆఫర్ కూడా పట్టేసింది అమ్మడు.
మమితా, అనస్వర ఇద్దరి కెరీర్ ఒకే విధంగా..
ఇట్లు అర్జున అంటూ ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతుంది అనస్వర. మలయాళంలో ఎనిమిదేళ్లుగా పాతిక సినిమాలకు పైగా అమ్మడు కెరీర్ కొనసాగిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే మమితా, అనస్వర ఇద్దరి కెరీర్ ఒకే విధంగా మొదలైంది. ఇద్దరు కలిసి సినిమాల్లో కూడా నటించారు. మలయాళంలో అనస్వర వరుస సినిమాలతో బిజీగా ఉంది అయినా కూడా అమ్మడికి తెలుగు, తమిళ భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.
తెలుగులో ఆల్రెడీ ఛాంపియన్ చేసింది నెక్స్ట్ ఇట్లు అర్జున చేస్తుంది. తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ గా వస్తున్న 7/జి బృందావన కాలనీ సీక్వెల్ లో కూడా అనస్వర ఛాన్స్ పట్టేసింది. ఇదే కాకుండా రెండు తమిళ సినిమాల్లో నటిస్తుంది. ఛాంపియన్ తో తెలుగు తెరకు పరిచయమైన అనస్వర ఇక్కడ ప్రేక్షకులు సినిమా పట్ల చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ దర్శక నిర్మాతలు తనపై చూపిస్తున్న ప్రేమకు అమ్మడు సూపర్ హ్యాపీగా ఉందట.
క్యూట్ లుక్స్ తో అదిరిపోయే టాలెంట్ తో..
కుదిరితే తెలుగులో మరిన్ని సినిమాలు చేసేలా అమ్మడి ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. ఐతే ప్రేమలు హీరోయిన్ మమితా బైజులా అంత క్రేజ్ తెచ్చుకోలేదు కానీ అనస్వర తన క్యూట్ లుక్స్ తో అదిరిపోయే టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను మరింత అలరించాలని చూస్తుంది. ఎలాగు ఛాంపియన్ ఈవెంట్ లో చరణ్ తో నీ ఫేస్ లో కళ ఉందని ప్రశంసలు పొందింది కాబట్టి అమ్మడికి ఒకటి రెండు హిట్లు పడితే ఏకంగా స్టార్స్ తో కూడా నటించే ఛాన్స్ వచ్చినా రావొచ్చని చెప్పొచ్చు.
అనస్వర చూడటానికి చిన్న పిల్లలా ఉంటుంది కానీ అమ్మడి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మలయాళ సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసే ఛాన్స్ ఉండదు. అయినా కూడా అనస్వరకు మంచి సినిమాలు చేయాలి నటనతోనే ఆడియన్స్ ని ఆకట్టుకోవాలనే ఆలోచన ఉందట. తెలుగులో తనపై ప్రేక్షకులు చూపిస్తున ఈ ప్రేమకు ఆమె ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయాలనే ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. సో మరో మళయాళ భామకు తెలుగు ఆడియన్స్ స్టార్ స్టేటస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్న విషయం అర్థమవుతుంది.
