Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఎన్ని రోజులు ఇలా

ఒక హీరోయిన్ తొలి సినిమా ఫ్లాప్ అయితే.. మళ్లీ అవకాశాలు దొరకడం కష్టమే. కానీ శ్రీలీల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది.

By:  Garuda Media   |   3 Nov 2025 6:00 AM IST
శ్రీలీల.. ఎన్ని రోజులు ఇలా
X

ఒక హీరోయిన్ తొలి సినిమా ఫ్లాప్ అయితే.. మళ్లీ అవకాశాలు దొరకడం కష్టమే. కానీ శ్రీలీల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. తెలుగులో తన తొలి సినిమా ‘పెళ్ళి సంద-డి’ డిజాస్టర్ అయినా.. అందులో తన అందచందాలు, డ్యాన్సులు యూత్‌కు బాగా నచ్చేశాయి. దీంతో తెలుగులో శ్రీలీలకు మంచి ఛాన్సులే వచ్చాయి. అందులోనూ రెండో చిత్రం ‘ధమాకా’ పెద్ద హిట్టయి శ్రీలీల డ్యాన్సులకు ఇంకా మంచి పేరు రావడంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

కెరీర్ ఆరంభంలోనే ఏకంగా మహేష్ బాబు‌తో ‘గుంటూరు కారం’లో జట్టు కట్టే ఛాన్స్ లభించింది. అది కాక స్కంద, భగవంత్ కేసరి లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశం అందుకుంది శ్రీలీల. కానీ ‘ధమాకా’ తర్వాత కథానాయికగా ఆమెకు ఒక్కటంటే ఒక్క సక్సెస్ లేదు. పైగా ఆమె పాత్రలు రొటీన్ అయిపోతుండడం.. తన నటన తేలిపోతుండడంతో శ్రీలీల కెరీర్ డోలాయమానంలో పడేలా కనిపిస్తోంది.

ఒక్క ‘భగవంత్ కేసరి’లో తప్పితే శ్రీలీల పెర్ఫామెన్సుకి ఎందులోనూ ప్రశంసలు దక్కలేదు. ఆమెవి కూరలో కరివేపాకు తరహా పాత్రలుగానే ఉంటున్నాయి. హీరోతో రొమాన్స్, కామెడీ చేయడం.. పాటల్లో డ్యాన్సులేయడం.. ఇదీ వరస. మొదట్లో క్యూట్‌గా అనిపించిన తన పాత్రలు, నటన.. తర్వాత ప్రేక్షకులకు మొనాటనస్‌గా తోస్తున్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్, జూనియర్.. ఈ సినిమాలు వేటిలోనూ తన పాత్రకు ప్రాధాన్యం లేదు. నటన గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఆ జాబితాలోకి కొత్తగా ‘మాస్ జాతర’ కూడా వచ్చి చేరింది.

ఇందులో శ్రీలీల పాత్ర, నటన తేలిపోయాయి. అసలే రవితేజ మార్కు రొటీన్ మాస్ మసాలా సినిమా.. అందులో వీక్ క్యారెక్టర్ పడడంతో శ్రీలీల మినిమం ఇంపాక్ట్ కూడా వేయలేకపోయింది. కేవలం డ్యాన్సుల్లో మాత్రం ఆమె మెరిసింది. కానీ సరైన పాత్ర, పెర్ఫామెన్స్ లేకుండా ఎన్నాళ్లిలా పాటల్లో మెరుపులతో సరిపెడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుధ కొంగర దర్శకత్వంలో రానున్న ‘పరాశక్తి’లో మ ాత్రం ఆమె కొత్తగా అనిపించే, పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేస్తన్నట్లు కనిపిస్తోంది. అదైనా ఆమె కెరీర్‌‌ను మారుస్తుందేమో చూడాలి.