అడవి శేషు సింగిల్ గానే ఉండిపోతాడా?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో అడివి శేష్ ఒకరు. వరుస హిట్లతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరో వ్యక్తిగత జీవితం పెళ్లి విషయంలో మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు.
By: Srikanth Kontham | 6 April 2026 10:00 PM ISTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో అడివి శేష్ ఒకరు. వరుస హిట్లతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్ హీరో వ్యక్తిగత జీవితం పెళ్లి విషయంలో మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ప్రస్తుతం శేష్ వయస్సు 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా? పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో ఆయన అభిమానుల్లో శేష్ సింగిల్‌గానే ఉండిపోతాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వెనుక ఆయన గతంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం కారణమన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. అడివి శేష్ గతంలో ఒక పంజాబీ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలినట్లు తానే స్వయంగా తెలిపాడు.
వీరిద్దరి రిలేషన్ షిప్ కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపో వాల్సి వచ్చింది. ఆ బ్రేకప్ శేష్‌ను మానసికంగా బాగా కుంగదీసింది. మరీ ముఖ్యంగా శేష్ పుట్టినరోజు నాడే ఆ పంజాబీ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడం శేషును మరింత బాధకు గురిచేసిందట. ఆ సంఘటన శేష్ మనసుపై బలమైన ముద్ర వేసింది. ఆ తర్వాత కూడా శేష్ ఒకటి రెండు రిలేషన్ షిప్స్‌లో ఉన్నట్లు శేష్ తెలిపాడు. కానీ ఆ బంధం కూడా పెళ్లి పీటల వరకు తీసుకెళ్లలేదన్నాడు. అప్పటి నుండి శేష్ తన వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన జీవితానికే (సినిమాలకే) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
శేష్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన ఇంట్లో వాళ్లు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. `పెళ్లి చేసుకోమని అడిగి అడిగి మా ఇంట్లో వాళ్లు కూడా అలసిపోయారు` అని శేష్ ఒక సందర్భంలో స్వయంగా వెల్లడించాడు. తల్లిదండ్రుల ఒత్తిడి ఉన్నప్పటికీ తను మాత్రం ప్రస్తుతం సినిమాలతోనే ప్రేమలో ఉన్నానని మరో ఆలోచన లేదని అంటున్నాడు. ఆయన చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ , పరిశోధనతో కూడుకున్నవి కావడంతో పూర్తి సమయాన్ని వాటికే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం అడివి శేష్ చేతిలో `గూఢచారి 2` ,`డెకాయిట్` వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి.
`డెకాయిట్` ఈనెలలోనే రిలీజ్ అవుతుంది. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న చిత్రం ఈ వారంలోనే రిలీజ్ అవుతుంది. `గుఢచారి 2` మాత్రం ఆన్ సెట్స్ లో ఉంది. గత కొంత కాలంగా శేష్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. వరుస విజయాలు నటుడిగా తారా స్థాయిలో కూర్చోబెట్టాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ జానర్లో సినిమాలు చేయాలంటే? అది శేష్ కు మాత్రమే సాధ్యమని ప్రూవ్ చేస్తున్నాడు. ముఖ్యంగా దేశ భక్తి నేపథ్యంలో స్పై సినిమాలకు టాలీవుడ్ లో హీరోల్లో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అదే ఇమేజ్ శేష్ ను ఇంత వరకూ తీసుకొచ్చింది.
