శేష్ 'డెకాయిట్'.. సూపర్ ఛాన్స్ ను క్యాష్ చేసుకుంటుందా?
టాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
By: M Prashanth | 7 April 2026 7:43 PM ISTటాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయనకు జోడీగా క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపాయి. ముఖ్యంగా అడివి శేష్ స్టైల్ యాక్షన్, మృణాల్ ఠాకూర్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సోషల్ మీడియాలో కూడా డెకాయిట్ పై మంచి బజ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లో కనిపించిన ఎమోషనల్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటి రోజుకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు కూడా బాగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇది సినిమాపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. సమ్మర్ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
ఇక ఈ వారం డెకాయిట్ కు బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశం కనిపిస్తోంది. గత వారం విడుదలైన బైకర్, రాకాస చిత్రాలు డీసెంట్ టాక్ తో నడుస్తున్నప్పటికీ, అవి భారీ కలెక్షన్లు రాబట్టే స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న డెకాయిట్ కు మంచి స్పేస్ దొరికినట్టే. అయితే పోటీ పూర్తిగా లేకపోలేదు. డెకాయిట్ తో పాటు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, పళ్లి చట్టంబి సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే అవి డబ్బింగ్ చిత్రాలు కావడంతో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో అనేది సందేహంగా ఉంది. కాబట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమాగా డెకాయిట్ కు కొంత అదనపు ప్రయోజనం దక్కుతుందనే చెప్పాలి. మొత్తంగా చూస్తే డెకాయిట్ కు ఈ వారం బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశం ఉంది. సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండి, పాజిటివ్ టాక్ వస్తే భారీ వసూళ్లు సాధించే ఛాన్స్ కచ్చితంగా ఉంటుంది.
ముఖ్యంగా అడివి శేష్ గత చిత్రాల మాదిరిగానే డెకాయిట్ సినిమా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇక ఫైనల్ గా డెకాయిట్ హిట్ అవుతుందా లేదా అనేది పూర్తిగా మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న బజ్, మార్కెట్ పరిస్థితి చూస్తే మాత్రం ఆ సినిమాకు సూపర్ ఛాన్స్ ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఆ మూవీ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందనేది అంతాా వేచి చూడాలి.
