ట్రంప్ ట్వీట్ ని పబ్లిసిటీకి వాడిన అడివి శేష్..!
ట్రంప్ త్వరలో జీ 2 కన్వినింగ్ ఉంటుందని ఎక్స్ లో పెట్టగా దానికి అడివి శేష్.. జీ 2 మాసివ్ ముందు డెకాయిట్ ఎక్స్ ప్లోషన్ ఉందని రిప్లై ఇచ్చాడు.
By: Ramesh Boddu | 31 Oct 2025 3:26 PM ISTకాదేది కవితకు అనర్హం అని అన్నట్టుగా కాదేది సినిమా పబ్లిసిటీకి అనర్హం అని మన తెలుగు యాక్టర్స్ చెబుతున్నారు. వాళ్ల వాడకం ఎలా ఉంది అంటే ఏకంగా సినిమా ప్రమోషన్ కోసం అమెరికా ప్రెసిడెంట్ ని కూడా వాడుతున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఎలాంటి ప్లాట్ ఫాం ని వదలట్లేదు యాక్టర్స్. ఇంతకీ విషయం ఏంటంటే టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ లేటెస్ట్ గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ని తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకున్నాడు.
ట్రంప్ G2 కన్వినింగ్ ట్వీట్..
ట్రంప్ త్వరలో జీ 2 కన్వినింగ్ ఉంటుందని ఎక్స్ లో పెట్టగా దానికి అడివి శేష్.. జీ 2 మాసివ్ ముందు డెకాయిట్ ఎక్స్ ప్లోషన్ ఉందని రిప్లై ఇచ్చాడు. అడివి శెష్ ఇచ్చిన రిప్లై ట్రంప్ చూసే ఛాన్స్ ఉండకపోవచ్చు కానీ జీ 2 అని ట్రంప్ పెట్టింది అది గూఢచారి 2 అన్నట్టు తను ఫీలి ఇలా డెకాయిట్, జీ 2ల ప్రమోషన్ ని ట్రంప్ ట్వీట్ ద్వాకా వాడటం అది కేవలం అడివి శేష్ వల్లే అయ్యింది.
అడివి శేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి డెకాయిట్ కాగా.. మరొకటి జీ2 అదే గూఢచారి 2. డెకాయిట్ ఒక లవ్ స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాను షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అసలైతే డిసెంబర్ 25 క్రిస్మస్ కి రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సినిమాను మార్చి 19కి రిలీజ్ వాయిదా వేశారు.
గూఢచారి సీక్వెల్ గా G2..
ఇక అడివి శేష్ అండ్ టీం గూఢచారి సీక్వెల్ గా G2 కోసం రెండేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. తెలుగు తెర మీద పర్ఫెక్ట్ రా ఏజెంట్ మూవీని చూపించేలా వారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీ 2 సినిమాలో వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. అడివి శేష్ సినిమాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి. కానీ సినిమా సినిమాకు అతను తీసుకునే టైం ఆడియన్స్ కి ఇబ్బంది కలిగిస్తుంది. ఐతే టైం తీసుకున్నా సరే మంచి అవుట్ పుట్ తో ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తాడు అడివి శేష్. మరి డెకాయిట్, జీ 2 ఈ రెండు సినిమాలతో అడివి శేష్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
ఈమధ్య సినిమా తీయడం కన్నా ఆ సినిమా గురించి ఆడియన్స్ లో డిస్కషన్ ఉండేలా చేయడం పెద్ద పనిగా మారింది. అందుకే మేకర్స్ సినిమా తీయడమే కాదు ప్రమోషన్స్ విషయంలో కూడా సీరియస్ ప్లానింగ్ తో వస్తున్నారు. ఎలా అయితే అడివి శేష్ ట్రంప్ ట్వీట్ కి సంబంధం లేకపోయినా కామెంట్ పెట్టాడో అలా సినిమాకు రిలేటెడ్ అయినా కాకపోయినా సందర్భాన్ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు.
