Begin typing your search above and press return to search.

'డాక్టర్ కాదు దొంగ'.. శేష్ డెకాయిట్ టీజర్ చూశారా?

రీసెంట్ గా శేష్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ ను సోషల్ మీడియాలో రివీల్ చేశారు.

By:  M Prashanth   |   18 Dec 2025 11:45 AM IST
డాక్టర్ కాదు దొంగ.. శేష్ డెకాయిట్ టీజర్ చూశారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో డెకాయిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాకు షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. డెకాయిట్ తోనే ఆయన డెబ్యూ ఇస్తుండగా.. యంగ్ ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్న డెకాయిట్ మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది ఉగాది పండుగకు వాయిదా వేశారు మేకర్స్. మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. రీసెంట్ గా శేష్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ ను సోషల్ మీడియాలో రివీల్ చేశారు.

నది ఒడ్డున అడివి శేష్ ఫోన్ లో మాట్లాడుతున్న సీన్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత హీరో హీరోయిన్స్ కారులో ఉండగా.. శేష్ ముద్దు పెట్టేదా అంటూ అడుగుతూ సైగ చేస్తారు. ఇంతలో టీజర్ మలుపు తిరుగుతుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ లో బ్లాక్ బస్టర్ సాంగ్ కన్నె పిట్టరో కన్ను కొట్టరో సాంగ్ ప్లే అవుతుండగా.. ఖైదీగా అడివి శేష్ ఎంట్రీ ఇస్తారు.

ఆ తర్వాత సినిమాలోని కీలక సీన్స్ చూపించిన మేకర్స్.. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్‌ ను పరిచయం చేశారు. చివర్లో నీవు డాక్టర్ వా అని అడిగితే.. కాదు దొంగ అని చెబుతారు అడివి శేష్. అయితే టీజర్.. పవర్ ఫుల్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. దూసుకుపోతుందనే చెప్పాలి.

ఓవరాల్ గా టీజర్ బట్టి సినిమా ప్రేమ, దోపిడీ అంశాల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. మాస్ ఓరియెంటెడ్ రోల్ లో అడివి శేష్ తొలిసారి కనిపించారు. సినిమాలో ఆయన రోల్ వివిధ షేడ్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. మదనపల్లె యాసలో ప్రావీణ్యం సంపాదించి, డైలాగ్స్ విషయంలో తన టాలెంట్ చూపించినట్లు కనిపిస్తున్నారు.

మృణాల్ రోల్.. సినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అనురాగ్, ప్రకాష్ రాజ్, అతుల్, సునీల్.. పవర్ ఫుల్ రోల్స్ లో సందడి చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ ధనుష్ భాస్కర్ విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం పక్కా అనేలా చెప్పాలి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండగా.. గ్యానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఐకానిక్ సాంగ్ కన్నె పిట్టరో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంది. మరి డెకాయిట్ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.