'లిటిల్ హార్ట్స్' దర్శకుడికి కరెక్ట్ హీరో దొరికాడా?
లిటిల్ హార్ట్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్.. తన తొలి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకుని టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.
By: M Prashanth | 26 March 2026 10:29 PM ISTలిటిల్ హార్ట్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్.. తన తొలి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకుని టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి. చిన్న కథ అయినా చెప్పిన విధానం, ఎమోషన్స్ ను సున్నితంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు గడిచినా, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
దీంతో సాయి మార్తాండ్ కొత్త మూవీ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సాయి మార్తాండ్ తన రెండో ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకున్న ఆయన, సరైన హీరో కోసం వెతుకుతున్న సమయంలో స్టార్ హీరో అడవి శేష్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఆయనకు కథను వినిపించగా, ఆ స్టోరీ శేష్ కు నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అడవి శేష్ తనకు నచ్చిన కథలనే ఎంచుకుంటూ, కంటెంట్ బేస్ట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన చిత్రాలు సాధారణంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, కొత్త కాన్సెప్టులతో ఉంటాయి. ఈ నేపథ్యంలో సాయి మార్తాండ్ చెప్పిన కథ కూడా వినూత్నంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
కథపై శేష్ సానుకూలంగా స్పందించడంతో, ఆ ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయినట్టే టాక్ వినిపిస్తోంది. అన్ని విషయాలు అనుకూలంగా కుదిరితే, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, చేర్పులు కూడా జరుగుతున్నాయని సమాచారం.
ఏదేమైనా ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, ఇది సాయి మార్తాండ్ కు రెండో సినిమా కాగా, అడవి శేష్ కు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఆ కాంబినేషన్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలైంది. లిటిల్ హార్ట్స్ మూవీతో మంచి కంటెంట్ చూపించిన దర్శకుడికి, కంటెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే హీరో దొరికారంటూ అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరి స్టైల్ ఒకదానికొకటి సరిపోతుందని, మంచి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. అయినప్పటికీ, సాయి మార్తాండ్ అడవి శేష్ కాంబినేషన్ నిజమైతే, ప్రేక్షకులకు మరో క్వాలిటీ సినిమా వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అందుకే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? ప్రేక్షకులను ఎలా అలరిస్తుందా? అన్నది తెలియాలంటే వేచి చూడాలి.
