కుక్కలను తొలగించొద్దు.. స్టార్ హీరో లేఖ
ఢిల్లీలోని వీధి కుక్కలను తొలగించాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీజేఐకి నటుడు అడవి శేషు లేఖ రాశారు
By: A.N.Kumar | 12 Aug 2025 4:55 PM ISTఢిల్లీలోని వీధి కుక్కలను తొలగించాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సీజేఐకి నటుడు అడవి శేషు లేఖ రాశారు. వీధి కుక్కల అంశంలో ఆదేశాలను పునఃపరిశీలించాలని లేఖలో అభ్యర్థించారు. అలాగే ఈ విషయంపైనే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాశారు.
వీధి కుక్కల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ టాలీవుడ్ హీరో అడవి శేషు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలోని వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు పట్ల ఆయన తన అభిప్రాయం వెల్లడించారు.
లేఖలో అడవి శేషు “వీధి కుక్కలు మన సమాజంలో ఒక భాగం. వాటిని ఒకేసారి తొలగించడం కరుణా రహిత చర్య అవుతుంది. ఈ ఆదేశాల వల్ల నిరపరాధమైన ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సాదరంగా కోరుతున్నాను” అని అభ్యర్థించారు. అలాగే, ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా లేఖ రాసిన ఆయన, జంతు సంక్షేమ సంఘాలు, పౌరసంఘాలతో సంప్రదించి మానవతా దృక్పథంతో పరిష్కారం కనుగొనాలని సూచించారు.
సినీ నటులు సామాజిక అంశాలపై ఇలాంటి స్పందనలు చూపడం అరుదు కాదు కానీ, అడవి శేషు ఈసారి తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పలువురు నెటిజన్లు ఆయన హ్యూమానిటేరియన్ జెస్టర్‌ను ప్రశంసిస్తున్నారు. .
