రాహుల్ డైరెక్షన్ లో శేష్ మూవీ!
టాలీవుడ్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో అడివి శేష్ ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 9 April 2026 5:15 PM ISTటాలీవుడ్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో అడివి శేష్ ఒకరు. ఆయన కెరీర్లో మరో విశేషం ఏమిటంటే, సినిమా నుంచి సినిమాకు మధ్య గ్యాప్ తీసుకోవడం. సాధారణంగా ఏడాది లేదా రెండేళ్ల విరామం తీసుకుంటూ కథల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగిన శేష్, ఈసారి మాత్రం తన స్ట్రాటజీని మార్చినట్లు కనిపిస్తోంది.
డెకాయిట్ తో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న శేష్, ఈసారి గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. డెకాయిట్ తర్వాత తన తర్వాతి సినిమాలను లైన్లో పెట్టి వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఆయన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న G2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాను మే1న రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశాలు లేవని, గూఢచారి ఈ ఇయర్ ఎండింగ్ కు వస్తుందని ఆల్రెడీ శేష్ చెప్పారు. వీలైనంత త్వరగా గూఢచారి2ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇది కాకుండా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి శేష్ సిద్ధమవుతున్నారు.
డెకాయిట్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని శేష్, రాహుల్ ఇద్దరూ ధృవీకరించారు. ప్రస్తుతం జీ2 షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు రాహుల్ వెల్లడించారు. డైరెక్టర్ గా చి.ల.సౌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్, ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా రూపొందించిన మన్మథుడు2తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాతి దిశగా కూడా రాహుల్ స్పష్టత ఇచ్చారు. ది గర్ల్‌ఫ్రెండ్ తర్వాత శేష్ తో చేసే సినిమా తనకు నెక్ట్స్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
