పండగ రేసుకి దూరంగా.. G2 మాస్టర్ ప్లాన్!
క్రిస్మస్, సంక్రాంతి, వంటి పండగ సీజన్లు పెద్ద సినిమాలకు ఎప్పటి నుంచో కీలకమైన రిలీజ్ విండోలుగా ఉంటున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 16 Sept 2026 3:17 PM ISTక్రిస్మస్, సంక్రాంతి, వంటి పండగ సీజన్లు పెద్ద సినిమాలకు ఎప్పటి నుంచో కీలకమైన రిలీజ్ విండోలుగా ఉంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఈ సీజన్లను టార్గెట్ చేయడం, భారీ ఓపెనింగ్స్ కోసం పోటీ పడటం సాధారణంగా కనిపించే పరిణామమే. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు మాత్రం ఆ రేసులోకి వెళ్లకుండా తమకు అనుకూలమైన రిలీజ్ విండోను ఎంచుకుంటున్నాయి. అడివి శేష్ నటిస్తున్న G2 కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించడం వెనుక కేవలం క్యాలెండర్ డేట్ మార్పు మాత్రమే కాకుండా ఒక మార్కెట్ స్ట్రాటజీ కనిపిస్తోంది.
పెద్ద పండగ సీజన్‌లో సినిమా రిలీజైతే ఒకేసారి ఎక్కువ థియేటర్ల కోసం పోటీ, ఇతర భారీ సినిమాలతో క్లాష్, స్క్రీన్ షేరింగ్ వంటి అంశాలు తప్పవు. ముఖ్యంగా సంక్రాంతి లాంటి సీజన్‌లో ఒక సినిమా ఎంత పెద్దదైనా, మార్కెట్ మొత్తం ఒకే సినిమాకు అందుబాటులో ఉండదు. అందుకే తమ సినిమా స్కేల్, కంటెంట్, టార్గెట్ ఆడియన్స్‌కు అనుగుణంగా ప్రత్యేకమైన రిలీజ్ స్పేస్‌ను ఎంచుకోవడం కూడా ఒక రకమైన బిజినెస్ ప్లానింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో G2 సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న సినిమా కంటే.. తనకంటూ సొంత రేస్‌ను క్రియేట్ చేసుకుంటున్న సినిమాగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక G2 విషయంలో మరో ముఖ్యమైన అంశం సినిమాను వేగంగా పూర్తి చేయడం కంటే ఫైనల్ కాపీకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ కావడంతో యాక్షన్ బ్లాక్స్, విదేశీ లొకేషన్స్, విజువల్ ఎలిమెంట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి అంశాలకు సహజంగానే ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఆరు దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తొందరపడి ఒక పెద్ద సీజన్‌కు తీసుకురావడం కంటే, తగిన టైమ్ తీసుకుని థియేటర్లలో మరింత ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేయాలనే ఆలోచన కనిపిస్తోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, యాక్షన్ ఫినిషింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి టెక్నికల్ అంశాల్లో ఫైనల్ స్టేజ్ వర్క్స్ సినిమాకు కీలకంగా మారే అవకాశం ఉంటుంది.
ఈ రోజుల్లో భారీ సినిమాల విషయంలో కేవలం త్వరగా రిలీజ్ చేయడం కంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను స్ట్రాంగ్ గా తయారు చేయడం కూడా కీలకంగా మారింది. ఓటీటీ, డిజిటల్ కంటెంట్ కారణంగా ఆడియన్స్ కు ఇంట్లోనే ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్న టైమ్ లో ఆడియన్స్ ను థియేటర్‌కు రప్పించాలంటే విజువల్ స్కేల్, యాక్షన్, సౌండ్, ప్రొడక్షన్ వాల్యూస్ వంటి అంశాలు ఎంతో కీలకమవుతున్నాయి. G2 విషయంలో మేకర్స్ తీసుకుంటున్న ఎక్స్‌ట్రా టైమ్ ఈ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను బలపరిచే ప్రయత్నంలో భాగమేనా అన్నది సినిమా విరిలీజైన తర్వాతే స్పష్టమవుతుంది. అయితే ఫిబ్రవరి రిలీజ్ ద్వారా పండగ పోటీని తప్పించుకోవడంతో పాటు, సినిమాకు స్పెషల్ మార్కెట్ స్పేస్‌ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం మేకర్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
