Begin typing your search above and press return to search.

అడివి శేష్ 'డెకాయిట్'.. కాస్త రిస్క్ లా ఉందే!

మార్చి 26, 27 తేదీల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దితోపాటు నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ రెండు సినిమాలపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   29 Oct 2025 7:00 AM IST
అడివి శేష్ డెకాయిట్.. కాస్త రిస్క్ లా ఉందే!
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ డెకాయిట్ రిలీజ్ డేట్ ను రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్ ప్లాన్ కూడా వేశారు. కానీ ఇంతలో అడివి శేష్.. ప్రమాదంలో గాయపడ్డారు.

ప్రస్తుతం కోలుకున్నప్పటికీ.. వైద్యులు రెస్ట్ తీసుకోమని సూచించారు. దీంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇంకా కీలకమైన సీన్స్ ను షూట్ చేయాల్సి ఉంది. దీంతో మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు కొత్త డేట్ ను 2026 మార్చి 19గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

అయితే విడుదల తేదీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. డెకాయిట్ మేకర్స్ ఎంచుకున్న డేట్ కు రిస్క్ పొంచి ఉందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది మార్చిలో ఇప్పటికే భారీ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో కొన్ని రోజుల క్రితం పెద్ది, ప్యారడైజ్ మూవీలు కర్చీఫులు వేశాయి.

మార్చి 26, 27 తేదీల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దితోపాటు నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ రెండు సినిమాలపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయని ఇప్పటికే అంతా అంచనాలు వేస్తున్నారు.. చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా..

అయితే ఆ రెండు సినిమాలు వచ్చిన వారం రోజుల ముందే ఇప్పుడు డెకాయిట్ రిలీజ్ కావడం కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కచ్చితంగా డెకాయిట్ థియేట్రికల్ రన్ పై పెద్ది, ప్యారడైజ్ ఎఫెక్ట్ పడుతుంది. ఇంకో పెద్ద విషయమేమంటే.. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న యష్ కూడా అప్పుడే రానున్నారు.

యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ కూడా మార్చి 19వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. డెకాయిట్ కూడా పాన్ ఇండియా మూవీనే. దీంతో అన్ని విధాలుగా మేకర్స్ డెకాయిట్ తో రిస్క్ చేసున్నట్లే. అయితే కంటెంట్ పై నమ్మకంతో ధైర్యంగా ముందుకు అడుగు వేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా సినిమా అలరిస్తుందని అనుకుంటున్నారట. వాళ్లు అనుకుంటున్నట్లు కంటెంట్ క్లిక్ అయితే మాత్రం పోటీ ఉన్నా దూసుకుపోతుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.