Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరంలో డెకాయిట్.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో ఒకటి డెకాయిట్.

By:  M Prashanth   |   28 Oct 2025 2:55 PM IST
కొత్త సంవత్సరంలో డెకాయిట్.. రిలీజ్ ఎప్పుడంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో ఒకటి డెకాయిట్. విభిన్నమైన కథలతో ఇప్పటికే ఆడియన్స్ ను మెప్పించి సూపర్ హిట్లు అందుకున్న అడివి శేష్.. ఇప్పుడు డెకాయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి యాక్షన్ డ్రామాగా ఆ సినిమా రెడీ అవుతోంది.




అడివి శేష్ హీరోగా ఇప్పటికే న‌టించిన క్ష‌ణం, గూఢ‌చారి చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ాఫ‌ర్‌ గా వర్క్ చేసిన ష‌నీల్ డియో.. ఇప్పుడు డెకాయిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాతోనే ఆయన డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ముందు ఫిమేల్ లీడ్ రోల్ కు శ్రుతి హాసన్ అనుకున్నా.. ఆమె తప్పుకున్నారు.

అయితే డెకాయిట్ మూవీ 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టే షూటింగ్ షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేశారు. జెట్ స్పీడ్ లో చిత్రీకరణ నిర్వహించాలని అనుకున్నారు. కానీ డెకాయిట్ షూటింగ్ లోనే అడవి శేష్ ఇటీవల గాయపడడంతో చిత్రీకరణ వాయిదా పడింది.

ఇంకా సినిమాకు సంబంధించిన కీలక సీన్స్ ను షూట్ చేయాల్సి ఉంది. అయితే అడివి శేష్ ఇప్పుడు గాయం నుండి కోలుకున్నా.. ప్రస్తుతం వైద్యుల సలహాతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ మళ్లీ ప్రారంభమవ్వడానికి కాస్త సమయం పడుతుంది. దీంతో మేకర్స్ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. క్రిస్మస్ కు విడుదల చేయడం లేదు.

తాజాగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఉగాది పండుగ కానుకగా మార్చి 19న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా మంగళవారం ఉదయం ప్రకటించారు మేకర్స్. ఆ సమయంలో స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. ఓ యాక్షన్ సీన్స్ కు సంబంధించిన పిక్ గా తెలుస్తోంది. కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సుప్రియా యార్ల‌గడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో డెకాయిట్ తోనే ఆయన అరంగేట్రం చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మరి కొత్త సంవత్సరంలో రానున్న డెకాయిట్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.