Begin typing your search above and press return to search.

అడివి శేష్ 'డెకాయిట్'.. సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. డెకాయిట్ ప్రేక్షకులను మొదటి నుంచే ఆకట్టుకునే విధంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

By:  M Prashanth   |   8 April 2026 4:10 PM IST
అడివి శేష్ డెకాయిట్.. సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్‌ లో తనదైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం డెకాయిట్ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఆ మూవీకి U/A సర్టిఫికెట్ లభించగా, దాదాపు 2 గంటల 30 నిమిషాల రన్‌ టైమ్‌ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. డెకాయిట్ ప్రేక్షకులను మొదటి నుంచే ఆకట్టుకునే విధంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కథలో ప్రేమ, భావోద్వేగాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, సహజంగా అనిపించే లవ్ స్టోరీతో సినిమా మొదలవుతుందట. అయితే కథ క్రమంగా ముందుకు సాగుతున్న కొద్దీ మలుపులు తిరుగుతూ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని సమాచారం.

రెండో భాగంలో కథ మరింత సీరియస్ గా మారి.. ఎమోషన్స్ తో నిండిన సన్నివేశాలు హృదయాలను తాకేలా ఉంటాయని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకులను కథలోకి మరింతగా లాగుతాయని తెలుస్తోంది. రచయితగా కూడా అడివి శేష్ తన ప్రత్యేకతను మరోసారి చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రంలో అడివి శేష్ నటన హైలైట్‌ గా నిలుస్తుందని సమాచారం. సీరియస్ రోల్ లో ఆయన తన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ఆకట్టుకుంటారని చెబుతున్నారు. హీరోయిన్‌ గా నటించిన మృణాల్ ఠాకూర్ తో ఆయన కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. వీరి మధ్య లవ్ హేట్ రిలేషన్ కథను మరింత థ్రిల్లింగ్‌ గా మార్చుతుందని టాక్. ఇంకా చిత్రంలో కనిపించే అతిథి పాత్రలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. స్పెషల్ రోల్ లో దర్శకుడు అనురాగ్ కశ్యప్ మెప్పించనున్నారని సమాచారం. అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన అనుభవంతో సినిమాకు మరింత బలం చేకూర్చారని తెలుస్తోంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమా విజువల్స్, ఎడిటింగ్, యాక్షన్ సీక్వెన్స్లు ఇంటర్నేషనల్ వాల్యూస్ తో ఉండనున్నాయని సెన్సార్ రిపోర్ట్ సూచిస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ ను మరింత ఎలివేట్ చేస్తుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు.

భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఆ మూవీ ప్రేక్షకులకు విభిన్నమైన సినీ అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా డెకాయిట్ చిత్రం.. లవ్, థ్రిల్లర్, ఎమోషన్స్ తో రూపొందిన ప్రత్యేక కథగా నిలిచే అవకాశముందని టాక్. ఇప్పటికే సెన్సార్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.