డెకాయిట్ కోసం భలే ప్లాన్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమా డెకాయిట్.
By: Sravani Lakshmi Srungarapu | 15 Dec 2025 6:13 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమా డెకాయిట్. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగాది, ఈద్ కానుకగా 2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.
డిసెంబర్ 18న డెకాయిట్ ట్రైలర్
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను వచ్చే ఏడాది మార్చి 19కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా అందించారు. డెకాయిట్ టీజర్ అప్డేట్ ను వెల్లడిస్తూ మేకర్స్ ఆడియన్స్ కు ఓ గుడ్‌న్యూస్ ను షేర్ చేశారు.
ముంబైలో గ్రాండ్ ఈవెంట్
డెకాయిట్ టీజర్ ను డిసెంబర్ 18, 202న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు, ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ను రెండు భాషల్లో, రెండు సిటీల్లో, రెండు టీజర్లను రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు. అందులో భాగంగానే డిసెంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు ముంబైలోని గెయిటీ గెలాక్సీలో రిలీజ్ చేయనుండగా, డిసెంబర్ 18 సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో మీడియాతో మీట్ అండ్ గ్రీట్ తో పాటూ టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మేకర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకునే టీజర్ లాంచ్ నుంచే ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారని, అందులో భాగంగానే టీజర్ ను రెండు ప్రధాన నగరాల్లో చేస్తున్నారని వారి ప్లాన్ ను చూస్తుంటే అర్థమవుతుంది.
కాగా ఈ సినిమాను సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్, సస్పెన్స్ తో పాటూ స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ చెప్తోంది.
