Begin typing your search above and press return to search.

క్రిస్మస్ ఖాళీ.. ఉన్న ఒక్కటి కూడా..?

అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి 2 సినిమాలు చేస్తున్నాడు. గూఢచారి 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ఫిక్స్ చేశారు. డెకాయిట్ సినిమా ఈ ఇయర్ క్రిస్ మస్ కి రిలీజ్ లాక్ చేశారు.

By:  Ramesh Boddu   |   11 Oct 2025 9:35 AM IST
క్రిస్మస్ ఖాళీ.. ఉన్న ఒక్కటి కూడా..?
X

టాలీవుడ్ యువ హీరోల్లో తన ప్రతి సినిమాతో ఆడియన్స్ కు ఒక మంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని అనుకునే వారిలో అడివి శేష్ ఒకడు. అతను చేస్తున్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి. తెలుగులో స్పై థ్రిల్లర్ సినిమాలు చేయాలంటే అడివి శేష్ లా చేయాలన్న విధంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి 2 సినిమాలు చేస్తున్నాడు. గూఢచారి 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ఫిక్స్ చేశారు. డెకాయిట్ సినిమా ఈ ఇయర్ క్రిస్ మస్ కి రిలీజ్ లాక్ చేశారు.

డెకాయిట్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్..

శానీల్ డియో డైరెక్ట్ చేస్తున్న డెకాయిట్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఇంప్రెస్ చేసింది. డెకాయిట్ అని పెట్టి కింద ఇది ఒక లవ్ స్టోరీ అని ట్యాగ్ ఇచ్చారు. ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్న ఈ సినిమాలో ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. ఐతే ఈ సినిమా క్రిస్ మస్ రిలీజ్ టార్గెట్ తో షూట్ చేస్తుండగా షూటింగ్ లో అడివి శేష్ కి గాయం తగలడంతో అనుకున్న టైం కి రిలీజ్ కష్టమే అనేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ ముందే ఖర్చీఫ్ లు వేసుకుని ఉంటారు.

అలా ముందు అనౌన్స్ చేయకపోతే రిలీజ్ క్లాష్ లు తప్పవు. ఐతే డెకాయిట్ సినిమా ఇప్పటికే లేట్ కాగా ఈ ఇయర్ క్రిస్మస్ రిలీజ్ కన్ ఫర్మ్ చేశారు. ఐతే ఇప్పుడు ఆ సినిమా క్రిస్మస్ కి కూడా రావడం కష్టమని అంటున్నారు. ఐతే ఈ సినిమా క్రిస్ మస్ కి వస్తుందని భావించారు మిగతా సినిమాలు కొన్ని రూట్ క్లియర్ చేశాయి. డిసెంబర్ లో సినిమాల రిలీజ్ లు ఉంటే అది ఫస్ట్ వీక్ లేదా క్రిస్మస్ వీక్ రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే క్రిస్మస్ టు న్యూ ఇయర్ ఆ వీక్ మొత్తం సినిమా సక్సెస్ అయితే మంచి వసూళ్లు వస్తాయి.

అఖండ 2 తాండవం డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్..

కానీ క్రిస్మస్ కి డెకాయిట్ ఒక్కటి రిలీజ్ ఉండగా ఇప్పుడు అది కూడా రాకపోవడంతో క్రిస్ మస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఐతే క్రిస్మస్ కి డెకాయిట్ రాకపోతే మరికొన్ని సినిమాలు ఆ టైం కు రిలీజ్ షెడ్యూల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు బాలయ్య అఖండ 2 తాండవం డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అనుకున్నారు. అదేదో క్రిస్మస్ కి తీసుకొస్తే మంచి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. సో సంక్రాంతికి సినిమాల ఫైట్ తెలిసిందే. క్రిస్మస్ కి డెకాయిట్ ఒక్కటే రిలీజ్ అనుకోగా ఆ సినిమా మిస్ అయితే క్రిస్మస్ రేసులో ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయన్నది చూడాలి.