Begin typing your search above and press return to search.

'డెకాయిట్' బాక్సాఫీస్.. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే?

అడివి శేష్ కెరీర్‌లో గత చిత్రాల కంటే ఈ సినిమాకు ముందే మంచి బజ్ ఉండటంతో, బుకింగ్స్ పరంగా ఇది కొత్త రికార్డులను అందుకుంది.

By:  M Prashanth   |   11 April 2026 10:57 AM IST
డెకాయిట్ బాక్సాఫీస్.. ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే?
X

టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, తన లేటెస్ట్ మూవీ 'డెకాయిట్'తో బాక్సాఫీస్ వద్ద మరోసారి మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. క్రైమ్ అండ్ రోమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అడివి శేష్ కెరీర్‌లో గత చిత్రాల కంటే ఈ సినిమాకు ముందే మంచి బజ్ ఉండటంతో, బుకింగ్స్ పరంగా ఇది కొత్త రికార్డులను అందుకుంది.




మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడం, శనీల్ డియో మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించేలా చేశాయి. ​సినిమాకు సంబంధించి కథనం, ఎమోషన్స్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అడివి శేష్ ప్లానింగ్ ప్రకారం ఈసారి మాస్ ఎలిమెంట్స్ కూడా జోడించడంతో బి, సి సెంటర్లలో కూడా వసూళ్లు పాజిటివ్ గానే ఉన్నాయి.




మొదటి రోజు మార్నింగ్ షోల కంటే మ్యాట్నీలు, సెకండ్ షోలకు ఆడియన్స్ కౌంట్ పెరగడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఇక 'డెకాయిట్' అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. బుక్ మై షో డేటా ప్రకారం, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 98.26 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇక మొదటి రోజు ముగిసేసరికి అదనంగా 150.47 వేల టిక్కెట్లు అమ్ముడవ్వడంతో, మొత్తం 248.73 వేల టిక్కెట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడవ్వడం చూస్తుంటే కంటెంట్ అనేది ఎంత ముఖ్యమో అర్ధమవుతుంది. ​వసూళ్ల లెక్కలు గమనిస్తే, తొలిరోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా శేష్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో అప్పుడే 575కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి, అక్కడ ఆయన కెరీర్ లోనే ఫాస్టెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

పెయిడ్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన రెస్పాన్స్ కూడా ఫస్ట్ డే కలెక్షన్లకు బాగా తోడైంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో షో షోకూ వసూళ్లు రెట్టింపు అవ్వడం విశేషం. ​మొత్తానికి 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద తన వేటను సక్సెస్ ఫుల్ గా మొదలుపెట్టింది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో కూడా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల షోలు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కమర్షియల్ గా ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.