Begin typing your search above and press return to search.

సినిమా గొప్పతనాన్ని చెప్పేది అదే!

కేవలం కలెక్షన్ల కోసమే కాకుండా, సినిమా ఇచ్చే అనుభూతి గొప్పగా ఉండాలనే శేష్ ఫిలాసఫీ ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి ..

By:  Madhu Reddy   |   12 March 2026 10:51 AM IST
సినిమా గొప్పతనాన్ని చెప్పేది అదే!
X

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో థ్రిల్ ఇచ్చే అతికొద్ది మంది హీరోలలో అడివి శేష్ ఒకరు. ఆయన సినిమా అంటేనే అందులో ఏదో ఒక కొత్త ప్రయోగం, అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని ఆడియెన్స్ నమ్ముతారు. అదే నమ్మకాన్ని నిలబెడుతూ ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. కేవలం కలెక్షన్ల కోసమే కాకుండా, సినిమా ఇచ్చే అనుభూతి గొప్పగా ఉండాలనే శేష్ ఫిలాసఫీ ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి ..

ప్రేమ, ద్రోహం, ప్రతీకారం - డెకాయిట్ అసలు కథ:

ఈ సినిమా కథాంశం ప్రధానంగా ప్రేమ, నమ్మకద్రోహం మరియు ప్రతీకారం అనే మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు ఒక రాబరీ నేపథ్యంలో మళ్లీ ఎలా కలిశారు, వారి మధ్య ఉన్న పాత కక్షలు ఏ మలుపు తిరిగాయి అనేది ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్. ఇక అడివి శేష్ ఇందులో గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా రగ్గడ్ మరియు రా లుక్‌లో కనిపిస్తుండగా, మృణాల్ ఠాకూర్ తన నటనతో సినిమాకు ఎమోషనల్ బలాన్ని ఇస్తోంది. ఇక బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'ఇన్‌స్పెక్టర్ స్వామి'గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఈ చిత్రానికే హైలైట్ అని చెప్పవచ్చు.

హై వోల్టేజ్ యాక్షన్ - బాక్సాఫీస్ అంచనాలు:

ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా 'రుబారు' వంటి పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శేష్ గత చిత్రాలైన ‘మేజర్’ సుమారు 70 కోట్లు, ‘హిట్-2’ సుమారు 50 కోట్లు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు ఈ ‘డెకాయిట్’ కూడా అదే స్థాయి విధ్వంసాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ యూత్‌ను కూడా ఆకట్టుకునేలా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేయడం సినిమా హైప్‌కు కారణమైంది.

సినిమా గొప్పతనం - శేష్ ఫిలాసఫీ:

అడివి శేష్ చెప్పినట్టు, ఒక సినిమా ఎంత సంపాదించింది అనే దానికంటే, ఆ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది అనేదే ముఖ్యం. 'మాయాబజార్', 'షోలే' వంటి ఆల్-టైమ్ క్లాసిక్స్ కలెక్షన్ల కంటే వాటి క్వాలిటీ వల్లే ఇప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ప్రొడ్యూసర్ కి సేఫ్ జోన్ లో ఉండగలిగితే చాలు సినిమా సక్సస్ అయినట్టే ఇప్పుడు అదే బాటలో ‘డెకాయిట్’ను కూడా కేవలం ఒక కమర్షియల్ సినిమాగా కాకుండా, ఒక గొప్ప అనుభూతిని ఇచ్చే చిత్రంగా తీర్చిదిద్దారు. ఇక ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇక అడివి శేష్ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, కొత్త తరహా మేకోవర్ తో వస్తున్న ‘డెకాయిట్’ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించేలా ఉంది. మృణాల్ ఠాకూర్ తో ఉన్న కెమిస్ట్రీ, అనురాగ్ కశ్యప్ విలనిజం సినిమాకు ప్రధాన ఆకర్షణలు. మరి ఈ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.