Begin typing your search above and press return to search.

నార్త్ మార్కెట్ లో 'డెకాయిట్'.. 'మేజర్'ను బీట్ చేస్తుందా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం డెకాయిట్ సమ్మర్ సీజన్‌ లో హిందీ మార్కెట్‌ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

By:  M Prashanth   |   14 April 2026 8:35 PM IST
నార్త్ మార్కెట్ లో డెకాయిట్.. మేజర్ను బీట్ చేస్తుందా?
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం డెకాయిట్ సమ్మర్ సీజన్‌ లో హిందీ మార్కెట్‌ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో కలిసి నటించిన ఆ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదట మిక్స్‌ డ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత క్రమంగా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఆ చిత్రానికి నగర ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజా అంచనాల ప్రకారం హిందీ వెర్షన్ ఒక్కటే దాదాపు రూ.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. మొదటి రోజు హిందీలో సుమారు రూ.90 లక్షల నెట్ కలెక్షన్స్ రాగా, సుమారు 12 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

అయితే రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ టాక్‌ తో కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఇక అడివి శేష్ గత చిత్రం మేజర్ హిందీ మార్కెట్‌ లో సుమారు రూ.11 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు డెకాయిట్ ఆ రికార్డును అధిగమిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం ఆ మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని చెప్పాలి.

హిందీ బెల్ట్‌ లో డెకాయిట్ మూవీకి ఉన్న క్రేజ్‌ కు ప్రధాన కారణాల్లో ఒకటి స్టార్ కాస్టింగ్. అడివి శేష్‌ తో పాటు మృణాల్ ఠాకూర్ ఉండటం, అలాగే బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, ప్రముఖ నటుడు అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించడం సినిమాకు బలంగా మారింది. అదే విధంగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఆ చిత్రం హిందీ ప్రేక్షకుల్లో క్రెడిబిలిటీని పెంచింది.

విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడం ఆ చిత్రానికి ఉన్న డిమాండ్‌ ను చూపిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో యూత్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక సినిమాకు దర్శకత్వం వహించినది షానియల్ డియో కాగా.. ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్ నిర్మించారు. కథ, స్క్రీన్‌ ప్లేలో అడివి శేష్ భాగస్వామ్యం కావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డైలాగ్స్‌ ను అబ్బూరి రవి అందించగా, సినిమాటోగ్రఫీ ధనుష్ భాస్కర్, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో సమకూర్చారు. ఏదేమైనా డెకాయిట్ హిందీ మార్కెట్‌ లో స్టడీ రన్ కొనసాగిస్తూ.. అడివి శేష్‌ కు మరో విజయాన్ని అందించే దిశగా ముందుకు సాగుతోంది. వచ్చే రోజుల్లో ఆ చిత్రం వసూళ్లు ఎంత వరకు పెరుగుతాయో, మేజర్ రికార్డును బీట్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.