Begin typing your search above and press return to search.

అడివి శేష్ ‘డెకాయిట్’.. ఓవర్సీస్ లో సైలెంట్ ర్యాంపేజ్!

పెద్ద స్టార్ల సినిమాలు కూడా విదేశీ గడ్డపై వసూళ్ల కోసం కష్టపడుతున్న తరుణంలో, ఒక మిడియం రేంజ్ సినిమా సైలెంట్ గా వచ్చి రికార్డులు క్రియేట్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

By:  M Prashanth   |   25 April 2026 10:48 AM IST
అడివి శేష్ ‘డెకాయిట్’.. ఓవర్సీస్ లో సైలెంట్ ర్యాంపేజ్!
X

పెద్ద స్టార్ల సినిమాలు కూడా విదేశీ గడ్డపై వసూళ్ల కోసం కష్టపడుతున్న తరుణంలో, ఒక మిడియం రేంజ్ సినిమా సైలెంట్ గా వచ్చి రికార్డులు క్రియేట్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అడివి శేష్ సినిమా అంటే ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అందుకే భారీ హడావుడి లేకపోయినా, కంటెంట్ మీద ఉన్న భరోసాతో ఆడియన్స్ సినిమా చూస్తారు. లేటెస్ట్ గా ‘డెకాయిట్: ఎ లవ్ స్టోరీ’ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే శేష్ బ్రాండ్ వాల్యూ ఏంటో మరోసారి అర్ధమవుతుంది.




ఒక సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి రావాలంటే మొదటి వీకెండ్ తరువాత కూడా క్లిక్ అవ్వాలి. ‘డెకాయిట్’ ఓవర్సీస్ టార్గెట్ 1.3 మిలియన్ డాలర్స్. అయితే, ఈ చిత్రం ఇప్పటికే ఆ మార్కును దాటేసి 1.4 మిలియన్ల డాలర్ల గ్రాస్‌తో అధికారికంగా లాభాల బాట పట్టింది. కథను నమ్ముకుంటే మార్కెట్‌లో ఎలాంటి మంచి కలెక్షన్స్ ఉంటాయి. ‘మేజర్’, ‘హిట్ 2’ సినిమాలతో శేష్ సంపాదించుకున్న క్రెడిబిలిటీ ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.

మేకర్స్ సినిమాను భారీ పాన్ ఇండియా హంగులతో కాకుండా, కథకు అవసరమైనంత వరకే ఖర్చు పెట్టి రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. దీనివల్ల రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా బయ్యర్లు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ప్రతి డాలర్ లాభాల కిందకే లెక్క. ముఖ్యంగా యూఎస్‌లో ప్రీమియర్స్ నుంచే మంచి సినిమా అనే టాక్ రావడంతో వీక్‌డేస్‌లో కూడా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. సెకండ్ వీకెండ్ నాటికి ఈ వసూళ్లు 1.5 మిలియన్ డాలర్స్ మార్కును తాకే అవకాశం ఉంది.

నటన పరంగా అడివి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ ఎంపిక కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. పోస్టర్లలో ఆమె ఇంటెన్స్ లుక్, ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలిగాయి. ఇది కేవలం దోపిడీల చుట్టూ తిరిగే యాక్షన్ సినిమా మాత్రమే కాదు, బలమైన ప్రేమకథ కూడా అనే విషయం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. అందుకే యువతతో పాటు కపుల్స్ ఈ సినిమాను చూడటానికి ఇష్టపడుతున్నారు.

అడివి శేష్ తనకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను పదిలపరుచుకున్నారు. స్టార్ డమ్ కంటే స్టోరీ పవరే గొప్పదని ఆయన మరోసారి నిరూపించారు. ‘డెకాయిట్’ ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ ఆగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్లలో అతిగా వెళ్లకుండా, సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ ను దోచుకోవడమే ఈ డెకాయిట్ అసలు స్టైల్ అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.