Begin typing your search above and press return to search.

అడివి శేష్ ‘డెకాయిట్’ వేట.. అదిరిపోయే బుకింగ్స్

వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్న అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

By:  M Prashanth   |   9 April 2026 10:38 AM IST
అడివి శేష్ ‘డెకాయిట్’ వేట.. అదిరిపోయే బుకింగ్స్
X

వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్న అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ రోమాంటిక్ డ్రామాను ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. అడివి శేష్ సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇందులో కూడా పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ క్లారిటీ ఇచ్చాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కావడం ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

ఈ సినిమా మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ముంబై, అమెరికాలో కూడా ఈ రోజు నుంచే ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అడివి శేష్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా, కంటెంట్ పరంగా కూడా సినిమా బలంగా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

ఇక డెకాయిట్ అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్ లో అడివి శేష్ తన పాత రికార్డులను తానే బ్రేక్ చేసేలా కనిపిస్తున్నారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ ద్వారా అప్పుడే ఈ చిత్రం 226K డాలర్లను వసూలు చేసింది. ప్రీమియర్ డే ముగిసేసరికి ఇది 325K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. గతంలో శేష్ నటించిన ‘మేజర్’ పేరిట ఉన్న రికార్డులను ఈ చిత్రం అధిగమించడం విశేషం.

ఓవరాల్ గా నార్త్ అమెరికాలో ప్రీమియర్ మరియు మొదటి రోజు అడ్వాన్స్ సేల్స్ కలిపి 315K డాలర్లకు చేరుకున్నాయి. ఇక మొదటి వీకెండ్ బుకింగ్స్ చూస్తే అప్పుడే 415K డాలర్ల మార్కును తాకాయి. అంటే దాదాపు హాఫ్ మిలియన్ మార్కుకు అతి చేరువలో ఈ సినిమా ఉంది. ఒక తెలుగు మీడియం రేంజ్ హీరో సినిమాకు ఓవర్సీస్ లో ఈ స్థాయి స్పందన లభించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘డెకాయిట్’ హవా స్పష్టంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షోలో దాదాపు 30 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా బుకింగ్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. అడివి శేష్ కు ఉన్న ఫ్యాన్ బేస్ తో పాటు మృణాల్ ఠాకూర్ క్రేజ్ కూడా బుకింగ్స్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ తో కూడిన ప్రేమకథ కావడంతో యువత ఈ సినిమాను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ స్టార్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తున్న ఈ జోరు చూస్తుంటే శేష్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉంది. ప్రమోషన్ల ద్వారా క్రియేట్ అయిన బజ్ కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. రేపు థియేటర్ల నుంచి ఎలాంటి టాక్ వస్తుందో అనే దానిపైనే ఈ సినిమా ఫుల్ రన్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ ఇంపాక్ట్ పడటం ఖాయమనిపిస్తోంది.