Begin typing your search above and press return to search.

అనుష్కను కాలితో తన్నిన అడివి శేష్.. ఆమె రియాక్షన్ పై ఊహించని కామెంట్!

అందులో భాగంగానే బాహుబలి సినిమాలో అనుష్కతో తన ప్రయాణాన్ని, ఆమెను కాలితో తన్నినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటి? అనే విషయాలను కూడా వెల్లడించారు అడివి శేష్.

By:  Madhu Reddy   |   5 April 2026 1:00 AM IST
అనుష్కను కాలితో తన్నిన అడివి శేష్.. ఆమె రియాక్షన్ పై ఊహించని కామెంట్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న అడవి శేష్ తాజాగా నటిస్తున్న చిత్రం డెకాయిట్. మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 10వ తేదీన తన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అడివి శేష్. ఈ చిత్రానికి అడివి శేష్ చిన్ననాటి స్నేహితుడు షానిల్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు పైగా ఆయనకు ఆ చిత్రం మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాని తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళ్ , హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు.

విడుదలకు వారం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా యాంకర్ సుమతో ఇంటర్వ్యూ నిర్వహించగా.. అందులో ఎన్నో విషయాలను పంచుకున్నారు అడివి శేష్. అందులో భాగంగానే బాహుబలి సినిమాలో అనుష్కతో తన ప్రయాణాన్ని, ఆమెను కాలితో తన్నినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటి? అనే విషయాలను కూడా వెల్లడించారు అడివి శేష్. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా మల్టీస్టారర్ గా పాన్ ఇండియా మూవీలకి బీజం వేస్తూ తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా.. విలన్ గా భల్లాళ దేవ్ పాత్ర పోషించిన రానా కుమారుడిగా అడివి శేష్ నటించారు.

దీనిపై అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో అనుష్కని మెడపై గట్టిగా తన్నాలి అని రాజమౌళి చెప్పారు. అయితే ఆ సీన్ కోసం నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ ఆ పాత్రకు తగ్గట్టుగా ఇంటెన్సిటీ రావట్లేదని , చాలా ఫోర్స్ గా తన్నమని రాజమౌళి చెప్పారు. కాలితో అనుష్కను తన్నాను. ఆ సమయంలో అనుష్క మెడ భాగం బెణికినట్లు అనిపించింది. అంత బలంగా నేను తన్నినా సరే అనుష్క ఏ మాత్రం బాధపడలేదు. సీన్ బాగా వచ్చిందా? లేదా? అని మాత్రమే ఆమె ఆలోచించింది. అందుకే అనుష్క పేరుకు తగ్గట్టుగా చాలా స్వీట్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు అడివి శేష్ .

నటనకు ఇంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టే ఆమె నటించే ఏ పాత్రైనా సరే జీవం పోసుకుంటుంది అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఇక గాయపడినా సినిమా కోసం ఆలోచించడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు కూడా అనుష్క పై ప్రశంసల కురిపిస్తున్నారు. ప్రస్తుతం అడివి శేష్ అనుష్క గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్ అండ్ క్రైమ్ మధ్య నలిగిపోయే మనుషుల ఎమోషనల్ రైడ్ ఈ సినిమాలో కనిపించబోతోంది అనే విషయం మనకు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది . ఇక ఇందులో బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.