Begin typing your search above and press return to search.

అడివి శేష్ జ‌ర్న‌లిస్ట్‌గా రివ్యూస్ రాయాల‌నుకున్నారా?

ఇండ‌స్ట్రీలో హీరోగా, రైట‌ర్‌గా మంచి బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్న అడివి శేష్ రీసెంట్‌గా `డెక‌రాయిట్` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం తెలిసిందే.

By:  Ravindar Gorantla   |   28 April 2026 4:21 PM IST
అడివి శేష్ జ‌ర్న‌లిస్ట్‌గా రివ్యూస్ రాయాల‌నుకున్నారా?
X

టాలీవుడ్ హండ్రెస్ ప‌ర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో వ‌రుస స‌క్సెస్‌లని సాధించ‌డం చాలా క‌ష్టం. కానీ యంగ్ హీరో మాత్రం యంగ్ హీరోల్లో హండ్రెడ్ ప‌ర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో సూప‌ర్ హిట్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో హీరోగా, రైట‌ర్‌గా మంచి బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్న అడివి శేష్ రీసెంట్‌గా `డెక‌రాయిట్` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం తెలిసిందే. మేజ‌ర్‌తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న త‌రువాత కొంత గ్యాప్ తీసుకున్నారు.

మ‌ళ్లీ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో మూడేళ్ల విరామం త‌రువాత `డెకాయిట్‌` మూవీతో ప్రేక్ష‌కుల ఉందుకొచ్చారు. `ఏ ల‌వ్ స్టోరీ` అనే క్యాప్ష‌న్‌తో ఏప్రిల్ 10న విడుద‌లైన ఈ సినిమా ఫ‌ష్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుని సూప‌ర్ హిట్ అనిపించుకుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో అనురాగ్ క‌శ్య‌ప్‌, ప్ర‌కాష్ రాజ్‌, ఆమీర్ ఖాన్ మేన‌కోడ‌లు జైన్ మేరీ ఖాన్, అతుల్ కుల‌క‌ర్ణి న‌టించారు.

ఓ దొంగ నేప‌థ్యంలో సాగే మ‌న‌సుకు హ‌త్తుకునే ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుని అడివి శేష్‌కు హీరోగా, రైట‌ర్‌గా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ హీరో అడివి శేష్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి ముందు అడివి శేష్ ఫిల్మ్ క్రిటిక్‌గా, రివ్యూ రైట‌ర్‌గా వ‌ర్క్ చేయాల‌నుకున్నార‌ట‌. అదే విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించి స‌ర్ ప్రైజ్ చేశారు.

ఇప్పుడైతే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. సినిమాలు వ‌ర్క‌వుట్ అయ్యాయి అంతా ఓకే. కానీ ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించ‌డానికి ముందు నేను ఒక జ‌ర్న‌లిస్ట్‌గా సినిమా ర‌వ్యూ రాస్తాన‌ని ఓ వెబ్ సైట్ వారికి ఇ మెయిల్ కూడా పంపించాను. దానికి వారు రెస్పాండ్ కాలేదు` అన్నారు. అప్ప‌ట్లో తెలుగు సినిమాల జూక్ బాక్స్‌లు స‌ద‌రు వెబ్ సైట్ వారు పోస్ట్ చేస్తుండే వారు. 25 ఏళ్ల క్రితం ఖుషి, యువ‌కుడు, మురారి వంటి సినిమాల పాట‌ల్ని అక్క‌డి నుంచే వినే వాడిని` అంటూ చెప్పుకొచ్చారు.

అంటే అడివి శేష్ హీరో కాక ముందు యంగ్ ఏజ్‌లోనే రివ్యూస్ రాయాల‌ని ట్రై చేశార‌ని తెలుస్తోంది. అప్పుడే సినిమాల‌పై మంచి నాలెడ్జ్ పెంచుకున్నార‌న్న‌మాట‌. ఆ నాలెడ్జే అడివి శేష్‌ని సినిమాల్లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అయినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ నాలెడ్జ్ ఉంది కాబ‌ట్టే అడివి శేష్ త‌ను న‌టించే సినిమాల‌కు హీరోగానే కాకుండా రైట‌ర్‌గానూ వ‌ర్క్ చేస్తూ స‌క్సెస్‌లు సాధిస్తున్నారు అని అంతా కామెంట్‌లు చేస్తున్నారు.