అడవి శేష్ తల ఎత్తేది ఆ ఒక్కడి ముందే!
యంగ్ హీరో అడవి శేష్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు.
By: Srikanth Kontham | 5 April 2026 6:00 PM ISTయంగ్ హీరో అడవి శేష్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. దేశ భక్తి నేపథ్యంలో డిఫెన్స్ పోర్సుడు కథల్లో నటించాలంటే? శేషు మాత్రమే నటించాలి అన్న ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ రకంగా బాలీవుడ్ లో విక్కీ కౌశల్ హైలైట్ అవుతున్నట్లు టాలీవుడ్ లో శేషు హైలైట్ అవుతున్నాడు. త్వరలో `డెకాయిట్` సినిమాతో ప్రేక్షకుల ముందు కొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
శేష్ మంచి హైట్ కలవాడు. అతడిని చూడాలంటే ఎంతటి వారైన తల ఎత్తి చూడాల్సిందే. తల దించి చూస్తానంటే కాళ్లు, శరీరం తప్ప ముఖం కనిపించదు. ఇప్పటి వరకూ శేష్ ముందు నుంచున్న వారంతా ఆయన్ని తలెత్తి చూసిన వారే తప్ప శేష్ మాత్రం తల ఎత్తి చూసిన మనిషి లేరు. అయితే అలాంటి ఓ వ్యక్తి ఉన్నాడు? అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని శేష్ రివీల్ చేయడంతోనే బయటకు వచ్చిందనుకోండి. అతడు ఎవరో కాదు. పవన్ కళ్యాన్ కుమారుడు అకీరానందన్. అకీరా హైట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడిని ఎంతటి వారైనా తల అలా ఎత్తి చూడాల్సిందే.
అకీరా ఎత్తు 180 సెంటీమిటర్లు. ఇంత హైట్ పవన్ కళ్యాణ్ కూడా లేరు. ఆయన కూడా కొడుకు ముఖాన్ని చూడాలంటే తల ఎత్తి చూడాల్సిందే. ఇద్దరు పక్క పక్కనే నుంచుంటే తండ్రీ కొడుకులు కంటే? అన్న దమ్ముల్లా కనిపిస్తారు. తల్లి రేణు దేశాయ్ భారీ హైటా? అంటే కాదు. కానీ మెగా కుటుంబంలో వరుణ్ తేజ్ హైట్ గల వ్యక్తి. అకీరా రానంత వరకూ అతడే ఆ కుటుంబంలో అత్యధిక ఎత్తుగల మనిషి. వరుణ్ హైట్ చూసి చిరంజీవి కూడా నటుడిగా సక్సెస్ అవుతాడా? లేదా? అని కాస్త టెన్షన్ పడ్డారు. కానీ నటనకు హైట్ తో సంబంధం ఉండదని వరుణ్ సహా చాలా మంది నటులు ప్రూవ్ చేసారు.
ఆ సంగతి పక్కన బెడితే? అడవి శేష్ ఎప్పుడు అకీరా నందన్ ని కలిసి తానే తలెత్తి చూస్తానన్నాడు. అలా ఎత్తి చూసిన వ్యక్తి అకీరా ఒక్కడిగానే పేర్కొన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం ఎత్తు మాత్రమే కాదు. కళాత్మకమైన అనుబంధం కూడా బలంగా ఉంది. అకీరా నందన్ అద్భుతమైన పియానో వాయిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అడివి శేష్ కోసం అకీరా ప్రత్యేకంగా పియానో వాయిస్తుంటారట. ఆ సంగీతాన్ని శేష్ ఎంతో ఆస్వాదిస్తారని, అకీరా వేళ్ల నుంచి వచ్చే ఆ మెలోడీ తనను ఎంతో పరవశింపజేస్తుందని శేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాగే అకీరాకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని శేష్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. అడివి శేష్ నటించిన సినిమాల సెట్స్‌కు కూడా అకీరా అప్పుడప్పుడు వెళ్తుంటారు.
