Begin typing your search above and press return to search.

సినిమా అంటే 9 to 5 జాబ్ కాదు..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   7 Sept 2025 11:00 PM IST
సినిమా అంటే 9 to 5 జాబ్ కాదు..!
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాడు. ముందు కెరీర్ లో చాలా కష్టాలు పడిన అడివి శేష్ క్షణం సినిమాతో మొదలు పెట్టి వరుస హిట్లు చేస్తూ వస్తున్నాడు. సినిమాకు కాస్త ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే తప్ప ష్యూర్ షాట్ హిట్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తాడు అడివి శేష్. ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్, గూఢచారి 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు రెండు కూడా ఒక దాన్ని మించి మరొకటి సూపర్ బజ్ తో వస్తుంది.

కాల్ షీట్స్ విషయంలో స్ట్రిక్ట్..

ఐతే సినిమా మేకింగ్ పై అడివి శేష్ చేసే కామెంట్స్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. సినిమా తీయడం అంటే నైట్ టు ఫైవ్ జాబ్ లా అసలు కాదని అంటున్నాడు అడివి శేష్. కొంతమంది స్టార్స్ తమ కాల్ షీట్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారు. కేవలం ఈ టైం నుంచి ఈ టైం వరకే కాల్ షీట్ ఇస్తారు. ఆ తర్వాత అసలు ఇవ్వరు. ఐతే సినిమా అంటే అంత తేలికైన విషయం కాదు ఇక్కడ యాక్టర్స్, మేకర్స్ మధ్య ఎంత కంఫర్ట్ ఉంటే అంత బాగుంటుంది.

అంతేకాదు యాక్టర్స్ తాము సినిమా షెడ్యూల్ టైమింగ్ విషయంలో అడ్జెస్ట్ మెంట్స్ ఉంటాయి. అందుకే 9 టూ 5 జాబ్ లా ఇక్కడ చేయడం కుదరదు. కొన్నిసార్లు షెడ్యూల్స్ కొనసాగించే అవసరం పడుతుంది. కానీ అలాంటి టైం లో యాక్టర్ కో ఆర్డినేషన్ ఉండాలి. బాలీవుడ్ లో కొందరు కేవలం కొంత పరిమిత టైమింగ్స్ లోనే షూటింగ్ చేస్తారన్న టాక్ ఉంది. ఐతే అడివి శేష్ మాత్రం సినిమాలకు అది ఏమాత్రం సూట్ అవ్వదని అంటున్నాడు.

ఆడియన్స్ కు ఎలాంటి సినిమా అందించాలో..

అడివి శేష్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆడియన్స్ కు ఎలాంటి సినిమా అందించాలో తనకు బాగా తెలుసు. సినిమా మేకింగ్ పరంగా ఎంత టైం తీసుకున్నా కూడా 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి సినిమాలు చేస్తుంటాడు. అందుకే అతని సినిమాలు ఈమధ్య మంచి సక్సెస్ రేటుతో వస్తున్నాయి. అడివి శేష్ డెకాయిట్ సినిమా డిసెంబర్లో రిలీజ్ లాక్ చేశారు. క్రిమస్ బరిలో ఆ సినిమా వస్తుంది.

సినిమాల్లో టైమింగ్స్ అనేవి చాలా కష్టం. కొన్నిసార్లు అలా షెడ్యూల్ పొడిగించాల్సిన అవసరం పడుతుంది. దానికి అందరు సహకరించాల్సిందే అంటూ అడివి శేష్ అంటున్నాడు. నిజమే సినిమా అనేది సమిష్టి కృషి అంతగా కష్టపడతారు కాబట్టే అంతకుమించిన సక్సెస్ అందుకుంటారు.